-
-
శ్రీ బ్రహ్మాండ పురాణం
Sri Brahmanda Puranam
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 136Language: Telugu
వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాఙ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్యమిత్రుడు డా. జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుక భాషలో నేటి జనసమాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.
పురాణ వాఙ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలుపంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి
* * *
అష్టాదశ పురాణాలలో చివరిదిగా చెప్పబడింది బ్రహ్మాండపురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలని ఈ పురాణం వివరిస్తుంది. "బ్రహ్మాండ మస్థిగీయతే" అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీ మహా విష్ణువు ఎముకలతో పోల్చి చెప్పబడిందని తెలుస్తోంది. అలాగే, "బ్రహ్మాండం ద్వాదశైవతు" అన్న వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్తం పన్నెండు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం ప్రక్రియా పాదం, అనుషంగ పాదం, ఉపోద్ఘాత పాదం, ఉపసంహారపాదం అనే నాలుగు పాదాలుగా విభజించబడింది.
- ప్రకాశకులు

- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72