-
-
శ్రీ బ్రహ్మ మహాపురాణం
Sri Brahma Mahapuranamu
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 531Language: Telugu
అష్టాదశ పురాణాలలోను సర్వప్రథమ పురాణం బ్రహ్మపురాణమని అన్నిపురాణాలు ప్రశంసిస్తున్నాయి. ఇది అన్ని పురాణాలలోకి ప్రాచీనమైనది.
బ్రహ్మపురాణం తత్రదౌ సర్వలోకహితాయవై! వ్యాసేనవేదవిదుషా సమాఖ్యాతం మహాత్మనా
తద్వై సర్వపురాణాగ్ర్యం ధర్మకామార్థమోక్షదం!! నానాఖ్యానేతిహాసాధ్యం దశసాహస్రముచ్యతే.
(అన్ని పురాణాలలోను ప్రప్రథమమైనది, సర్వలోకములశుభము కొఱకు మహాత్ముడు, వేదవిదుడైన వ్యాసునిచేత కూర్చబడినది. ధర్మకామ అర్థమోక్షములను ప్రసాదించునది, అనేక అఖ్యాన ఇతిహాసములతో కూడి పదివేల శ్లోకములు కలిగిన బ్రహ్మపురాణము సర్వపురాణములలోను శ్రేష్ఠమైనది).
పూర్వ ఉత్తరమును రెండు భాగములుగా ఉన్న ఈ పురాణమునందు పురాణ పంచలక్షణములు సంపూర్తిగా నిరూపింపబడి ఉన్నాయి. దక్షాది ప్రజాపతుల ఉత్పత్తి దేవాసుర సంగ్రామము, లోకేశ్వరుడైన సూర్యుని వంశోత్పత్తి, సూర్యచంద్రవంశరాజుల వృత్తాంతాలు, శ్రీకృష్ణుని చరిత్రము, పార్వతీ జననము, ఉమాకళ్యాణము మొదలైన ఆఖ్యానోపాఖ్యానాలు సుందరంగా పదమూడువేల ఏడు వందల నలభై అయిదు శ్లోకాలలో వర్ణించబడ్డాయి.
కోణార్క్ లోని సూర్యదేవాలయ నిర్మాణము, సూర్య ఆరాధన మొదలైన విశేషములతో పాటుగా, పూరీ జగన్నాథ దేవాలయ నిర్మాణము పురుషోత్తముడైన ఆ దేవదేవుని మహాత్త్యము, అనేక స్తోత్రాలు, ప్రార్థనా స్తుతులు విస్తృతంగా ఉన్న పురాణం ఇది. పార్వతీ కళ్యాణ సందర్భంలో చేసిన ఋతువర్ణనలు ప్రబంధశైలిని తలపిస్తాయి.
పురాణ కథలకు ముందుగా దాదాపు 132 పేజీలలో గల అష్టాదశ పురాణాలను గూర్చిన అనేక విషయాలు, బ్రహ్మపురాణాన్ని గురించిన ప్రత్యేక విషయాలు సమగ్రంగా తెలిపే పీఠిక ఈ గ్రంథానికి ప్రత్యేక అలంకారం.
భక్తి ముక్తి దాయకమైన ఈ మహాపురాణం తెలుగువారి అందరి గృహాలను తప్పక అలంకరించవలసిన గ్రంథం.

- ₹60
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹324