-
-
శ్రీ భగవద్గీతా సారం
Sri Bhagavadgita Saram
Author: Ichchapurapu Ramachandram
Publisher: Victory Publishers
Pages: 89Language: Telugu
వేదాల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. మళ్ళీ ఆ భగవద్గీతకు సారమంటూ ఏమిటి? ఎందుకు?
ఎందుకంటే... నేటి సమాజంలో... వ్యవస్థలో మనిషి జీవితం అతివేగవంతము, విరామరహితము అయిపోతూ... మంచి పుస్తకం చదవడానికి తీరికని మిగలనివ్వడం లేదు. డబ్బులు వెనుకా, పనుల వెనుకా, సుఖవిలాసాల వెనుకా పరుగుతీస్తున్న ఆధునిక మానవుడికి "సూక్ష్మంలో మోక్షం అందాలి".
భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలని ఉన్నా ఆ గ్రంథం సైజుని చూసి భయపడి (సందేహించి) తామంత పుస్తకం చదవలేమని వదిలేస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ సంగ్రహ సంక్షిప్త గీత గీతాసారం.
ఈ భగవద్గీతాసారం మూలంలో 745, వాడుకలో 574 శ్లోకాలు (సంస్కృతంలో) కల గ్రంథాన్ని తక్కువ సమయంలో సులభంగా అందరికీ అర్థమయ్యే తెలుగులోనూ అందించాలనే కాక - అమృతం లాంటి భగవద్గీతను ఈ సారం ద్వారా రుచి చూపితే.. దీనిని చదివినవారిలో కొందరయినా మూలాన్ని చదువతారనే ఆశ, ఆకాంక్ష, విశ్వాసాలతో గీతాసారాన్ని అందిస్తున్నాము.
ఇది చదివాక మూలం చదవడానికి పాఠకులు భయపడకుండా ఉండాలనేదే ఈ గీతాసారం లక్ష్యం.
Naku motham chadavalani vundi bt Samskrutham lo ardam kavadam ledu telugulo chadavalani kuduruthundhaa