-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీ ఆంధ్ర రఘువంశము (free)
Sri Andhra Raghuvamsamu - free
Author: Alamuru Venkatachalamu
Publisher: Self Published on Kinige
Pages: 440Language: Telugu
నా సాహితీమిత్రులు, శ్రీ ఆలమూరు వెంకటాచలముగారు ఆంద్రీకరించిన రఘువంశ మహాకావ్యాన్ని ఆమూలాగ్రంగా చదివి ఆనందించేను. సంస్కృత మహాకవులలో కాళిదాసుకి గల స్థానాన్ని నేను వివరించవలసిన పనిలేదు. కవితాకళాప్రియులకందరికి, ఆ మహాకవి శిరోధార్యమే. కాళిదాసకృత కావ్యాల్లో రఘువంశం ఉత్తమోత్తమం అని పలువురు పండిత విమర్శకుల అభిప్రాయం. అటివంటి మహాకావ్యాన్ని గద్యపద్యాల్లోకి అనువదించి, సహృదయుల్ని మెప్పించడం సామాన్య విషయం కాదు. ఈ మహాకార్యాన్ని శ్రీ వెంకటాచలము గారు సర్వదా సాధించగలిగారని చెప్పటానికి నాకేటువంటి సందేహము లేదు. ఆధునిక కాలంలో ప్రతిభా వ్యుత్పత్తులు రెండూగల కవులు చాలా అరుదు. నిసర్గమైన ప్రతిభకు నిర్మలమైన వ్యుత్పత్తితోడుకాగా శ్రీ వెంకటాచలము గారి కవిత, అనువాదమైనప్పటికీ, స్వతంత్రకావ్యంలాగే, పఠనయోగ్యమై, సహృదయ పాఠక జనానికి తుష్టిని, పుష్టిని, చేకూరుస్తూ ఉన్నది. మూలభావనకు లోపం రానీయకుండా తెలుగు నుడికారానికి భంగం వాటిల్లకుండా ఈ మహాకావ్యాన్ని అందించిన శ్రీ వెంకటాచలము గారు నిజంగా ధన్యులు.
- కె.వి.ఆర్. నరసింహం
