-
-
శ్రీ ఆంధ్రనాయక శతకము
Sri Andhra Nayaka Satakamu
Publisher: Nirmala Publications
Pages: 122Language: Telugu
ఈ శతకం చదివే సందర్భంలో రామాయణ, భారత భాగవతాలు మన జ్ఞప్తి పథం లోనికి వచ్చినిలుస్తాయి. ఒక్కక్షణం దానిపై దృష్టి నిలిపితే, దాని వెనుకగల గాథ మొత్తంగా కన్నుల ముందు కదలాడుతుంది. ఆ చెప్పిన తీరు పాఠకుని ఒక పట్టాన దాని నుండి వెలికి రానీయదు. ఒక్క శతకంతో పాఠకులలో భక్తిభావం కుదురుకునేట్లు చేయటం - అదెంత అబ్బురమో కదా! ఇక భాష - పురుషోత్తమకవి సొమ్ము. ఆయనకు గల శబ్దాధికారం ఇంతటిది, ఇలాంటిది అని చెప్పటం కష్టం. ఆ విషయంలో నన్నయను తలపిస్తాడు. ఇది నేననటం లేదు. శతకం చదివితే మీరూ అవునంటారు. ఈ అన్ని కారణాలను దృష్టిలో వుంచుకునే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, భాగవతాన్ని పోతన్న రచింపకుంటే, అది ఎవరి వల్ల నయ్యేదని ఒక సభలో అడుగగా, కాసుల పురుషోత్తమ కవి ఆ పని చేసి వుండేవాడని అన్నారట!
ఇక్కడ నేనొకమాట చెప్పదలచుకున్నాను. ఇది చదివితే మీరు ప్రస్తుతం భక్తులు గాకుంటే భక్తులుగావటం తథ్యం. భక్తులే అయితే, భక్తిభావం మరింత సాంద్రమవుతుంది. భాషపై ఎనలేని మక్కువ కలుగుతుంది. తెనుగు తీయదనమేమో బుద్ధికందుతుంది. కవులు కాదలచుకుంటే మార్గం సుగమమవుతుంది. మీ పిల్లల చేత దీనిని పఠింపచేస్తే వారికి భాషా సౌష్టవం అబ్బుతుంది. ఎందుకంటే, ఎలాగంటే - పద్యాన్ని ఒక్కసారి - మీరుగా స్పష్టంగా, పదాల విరుపు విరామాలను పాటిస్తూ వారికి చదివి వినిపించి, అభ్యాసం చేయించండి. ప్రసక్తమైన భాగవత కథలను విడమరచి చెప్పండి. చాలు! ఇక శతకాన్ని వారు విడిచిపెట్టలేరు. అందులోని గమకం వారిని వదిలిపెట్టనివ్వదు. దానికి తోడు సునిశితమైన హాస్యం, దానివెంట భగవంతుని లీలలను ఎత్తిపొడుస్తూ చేసిన అపహాస్యం, వారిని ఆకట్టుకుంటాయి. తెనుగు పలుకుబడిలోని తీయదనం బోధపడుతుంది. మాటకారితనం అంటే ఎలా వుంటుందో తెలిసివస్తుంది. దానితోపాటు భాగవతమంతా మస్తిష్కంలో ముద్రితమవుతుంది.అలా భాగవతం పఠించి తీరాలన్న కోరిక వేళ్ళు తన్నుతుంది. మరింతగా భాషాభివృద్ధి జరిగిన తరువాత భాగవతం ఒక్కసారైనా తమ జీవితకాలంలో చదివి తీరుతారు. అలా ఉత్తమ చారిత్రశిక్ష అలవడుతుంది. సంఘంపట్ల బాధ్యతాయుతంగా మెలిగే తీరు అలవడుతుంది. వ్యక్తిగత జీవనంలో సంపూర్ణమూర్తిమత్వం ప్రకాశిస్తుంది. ఇంతకంటే పిల్లల పట్ల బాధ్యతగల తల్లిదండ్రులు ఆశించేది మాత్రం మరేముంటుంది గనుక! అంతటి మహత్వపూర్ణ శక్తిగలది ఈ ఆంధ్రనాయక శతకం.
- ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు

- ₹86.4
- ₹324
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4
- ₹86.4
- ₹324
- ₹324
- ₹594
- ₹108
- ₹86.4