-
-
శ్రీ & శ్రీమతి
Sri And Srimati
Author: Tejarani Tirunagari
Publisher: Manrobo Publications
Pages: 52Language: Telugu
డెత్ సెంటెన్స్... నార్త్ అవెన్యూ తర్వాత పూర్తి కాంట్రాస్ట్ గా రాసిన నవల ‘శ్రీ & శ్రీమతి’... భార్యాభర్తల మధ్య ఉండే అపోహలు అపార్థాలు అనుమానాలు... బ్యూటిఫుల్ లైఫ్ లో స్పీడ్ బ్రేకర్స్ గా ఉండకూడదన్న విషయాన్ని చెప్పాలనిపించింది. మీరెప్పుడు క్రైమ్ థ్రిల్లర్ లాంటివే రాస్తారా... అన్న ప్రశ్నకు అక్షరాలతో చెప్పిన ఆన్సర్... ‘శ్రీ & శ్రీమతి.’
ఇందులో చందన పాత్ర , చరణ్ పాత్ర మన ముందు కనిపిస్తాయి.
కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ విషయాన్నీ విస్మరించడం వల్లే కాపురంలో కలతలా, కళ్ళల్లో కన్నీటి నలకలు...
సవతి అనగానే ఆగర్భశత్రువుగా చూడ్డానికి కారణం.. ఆమె కన్నతల్లి కాకపోవడం.తలి స్థానంలోకి అపరిచితవ్యక్తి రావడం.
అర్థం చేసుకుని అక్కున చేర్చుకుంటే సవతితల్లి కూడా కన్నతల్లి కాగలదు. ఈ నవలలో నేను చెప్పిన విషయం ఇదే..
భార్యాభర్తల అనుబంధాలకు అర్థం చెబుతూ, అపార్థాలను దూరం చేసుకోమని చెప్పే ప్రయత్నమే ‘శ్రీ & శ్రీమతి’.
భార్యాభర్తల మధ్య వుండే అందమైన గిల్లికజ్జాలు జీవితం విలువలను అందంగా చెప్పారు రచయిత్రి.అభినందనలు ఇంత మంచి నవల అందించినందుకు కినిగెకు కృతఙ్ఞతలు.
గొప్ప ఫీల్ వున్న నవల. " ఇగో " లతో లైఫ్ ను మిస్ లీడ్ చేసుకునేవాళ్లకు కనువిప్పు కలిగించే నవల.భార్యాభర్తలు ఇంత లవ్లీ గా వుంటారా..? చాలా బావున్న నవల శ్రీ
కుటుంబ విలువలకు పట్టం కట్టిన నవల.సాధారణంగా సవతితల్లి అంటే గయ్యాళిలా విలన్ లా చూపిస్తారు.కానీ సవతితల్లి అమ్మలా కూడా చూసుకుంటుందని చెప్పారు..గ్రేట్.
కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ విషయాన్నీ విస్మరించడం వల్లే కాపురంలో కలతలా, కళ్ళల్లో కన్నీటి నలకలు.
ఈ వాక్యం ఎవర్ గ్రీన్ ...
తేజారాణి గారూ
మీ నవలలు అంటే చాల ఇష్టం.ముఖ్యంగా డెత్ సెంటెన్స్ ,కొంగుచాటుప్రేమ. నేను కాన్సర్ ని జయించాను.విభిన్నమైన సబ్జక్ట్స్,
మీరు సృష్టించిన పాత్రల్లో జీవం ఉట్టిపడుతుంది.
అమ్మా మీ నవల శ్రీ
మానవ జీవితాల్లోని వివిధ పార్శ్వాలను స్పృశించే మీ రచనలు బావుంటాయి.
దాంపత్య జీవితంలోని మధురమైన ఘట్టాలను అలకలను అర్థం చేసుకోవడాలను అర్థవంతంగా చూపించిన నవల " శ్రీ ౭శ్రీమతి " అభినందనలు ధన్యవాదాలు.
పెళ్ళైన దంపతులు తప్పక చదవవలిసిన నవల,
ఒకరినొకరు అపార్థాలు లేకుండా అన్యోన్యంగా ఎలా ఉండవచ్చో చెప్పే మంచి నవల,
అపార్థాలతో కుళ్లూకుతంత్రాలతో సాగే టీవీ సీరియల్స్ కన్నా ఇలాంటి ఆహ్లాదంగా వున్నా నవల మిన్న .
మీ నవల శ్రీ