-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శ్రీ ఆనంద ఆంజనేయం (free)
Sri Ananda Anjaneyam - free
Author: Viswapathi
Publisher: Shri Designs
Pages: 31Language: Telugu
శ్రీ ఆంజనేయుడు భక్త సులభుడు. ఆయనను నిత్యం స్మరించేవారికి బుద్ధి, బలం, యశస్సు, తేజస్సు, ధైర్యం కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యమైనా వెంటనే తొలగిపోతుంది. సర్వసౌభాగ్యాలూ కలుగుతాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దయవలన నేను ఇప్పటిదాకా ఆ స్వామి లీలలపై పదిహేను పుస్తకాలు రచించటం జరిగింది. ఆ స్వామి దయతో ఇవన్నీ భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము, శ్రీ నరసింహ వ్రతకల్పము ఎంతో ప్రాచుర్యం పొంది దేశ విదేశాలలో భక్తుల ఇళ్ళలోను, అనేక దేవాలయాలలోను నిత్యం ఆచరింపబడుతున్నాయి. నా ఆప్తులు కొంతమంది ఎప్పటినుంచో నన్ను శ్రీ ఆంజనేయుల వారి లీలలపై పుస్తకం రచింపవలసిందిగా కోరుతున్నారు. ఆ స్వామి అనుగ్రహం అయినప్పుడు తప్పక వ్రాయగలనని చెప్పాను. ఇన్నాళ్ళకు ఆ పవనపుత్రుని అనుగ్రహం కలిగింది. ఒకనాడు తెల్లవారుఝామున ఆ స్వామి అద్భుత రూపంలో ప్రకాశిస్తూ ఎంతో ఆనందస్వరూపుడై స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆనాడే ఆ ఆనంద ఆంజనేయం నా మనస్సులో రూపుదిద్దుకుంది. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరము ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఇందులో నా గొప్పతనం ఏ మాత్రం లేదు. అంతా ఆ స్వామి అనుగ్రహమే! శ్రీమన్నారాయణులవారి అవతారమైన శ్రీరామచంద్రుని ప్రియ భక్తుడు ఆంజనేయులవారు. ఆ స్వామి చిరంజీవియై ఇప్పటికీ తన భక్తులు తనను కానీ, ఆ శ్రీరామచంద్రులవారిని కానీ స్తుతిస్తూ ఉంటారో అక్కడ తప్పక ఉండి తీరుతాడు.
ఆ స్వామి దయవలననే నేను ఈ పుస్తకం రచించటం జరిగింది. ఇదంతా ఆ స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ పుస్తకం చదివినవారికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. ఎవరైతే ఆ హనుమంతులవారినే మనస్సులో స్మరిస్తూ ఈ పుస్తకాన్ని చదువుతారో వారికి అన్నింటిలోనూ జయం కలుగుతుంది.
- తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
