-
-
శ్రీ అగ్ని మహాపురాణం
Sri Agni Mahapuranam
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 757Language: Telugu
అగ్నిదేవుడు వశిష్ఠమహర్షికి చేసిన ఉపదేశం అగ్ని పురాణం. ‘వామో హ్యాగ్నేయ ముచ్యతే’ అని పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమపాదంగా భావించబడుతున్నది ఈ పురాణం.
అగ్ని పురాణం కేవలం పురాణ పంచలక్షణాలే కాకుండా ఇంకా అనేక విషయశోభితం. మిగిలిన పురాణాలలో వలె దీనిలో కథలకు ప్రాముఖ్యత కనిపించదు. కానీ ఈ సృష్టిలో గల విద్యలు, పదార్థాల లక్షణాలు, వాటి పరీక్షా విధానం, భారత రామాయణ భాగవత కథలు, భగవద్గీత, స్వప్నాలు, శకునాలు మొదలైన విషయాలకు సంబంధించిన సంక్షిప్త కథనం కనిపిస్తుంది. అంతేగాక సాముద్రిక, సాహిత్య, వ్యాకరణ, ఛందో, అలంకార శాస్త్ర లక్షణాల వివరణ కూడా ఉన్నది. మొత్తం మీద ఇది మధ్యయుగం వరకు వికసించిన సమస్త భారతీయ విద్యలకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వం అని భావించవచ్చు. కళలు, శాస్త్రములు, సంగ్రామశాస్త్రం, గజ, అశ్వ, పశువైద్య చికిత్సలు, రత్నశాస్త్రము, రోగ నిర్ధారణ రోగలక్షణములు, చక్కని ఆరోగ్యానికి పండంటి సూత్రాలు, నేరపరిశోధన, శిక్షాస్మృతి, ధర్మశాస్త్రం, వివిధ స్మృతుల సంగ్రహంతో ఇందులో దాదాపుగా స్పృశించని విషయమే లేదు. అద్వైత బ్రహ్మతత్వం ఈ పురాణంలో ప్రత్యేకంగా వివరించబడింది. మునులు, ఋషుల, రాజవంశాల చారిత్రక విషయాలతో పాటుగా వివిధ వ్రతాలు, ఉపవాస దినాలు, తీర్థాలు, క్షేత్రాల విషయాలు కూడా ఈ పురాణంలో చోటు చేసుకున్నాయి.
భారతీయ సంస్కృతి, మతధార్మిక, చారిత్రక విషయ సంశోభితమైన ఈపురాణం అష్టాదశ పురాణాలలోనే చాలా ప్రత్యేకత గలది.
“ఆగ్నేయేహిపురాణేస్మి సర్వాఃవిద్యాఃప్రదర్శితాన్” (383-52) అని తనను గురించి చెప్పుకొన్న ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు, దాదాపు పదిహేనువేల అయిదువందల శ్లోకాలు ఉన్నాయి.
ఆగ్నేయం పఠితం ధ్యాతం శుభంస్యాద్భుక్తి ముక్తిదమ్.
(అగ్ని పురాణాన్ని చదివినా, స్మరించినా భుక్తి, ముక్తులు సమకూరుతాయి) అని చెప్పబడిన సమస్త భారతీయ విజ్ఞాన సర్వస్వమైన అగ్ని పురాణ తెలుగు అనుసరణ ప్రతి గృహానికీ అలంకారం కావాలని మా ఆకాంక్ష.

- ₹60
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹324