-
-
శ్రీమద్దేశినేని భగవద్గీత
Sreemaddesineni Bhagavadgeeta
Author: Desineni Venkatramaiah
Publisher: Desineni Anjaneyulu
Pages: 214Language: Telugu

తెలుగు అనువాదము: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య
శ్రీకారంతో రచనను ప్రారంభించి సనాతన సత్సంప్రదాయాన్ని పాటించడంతోపాటు, 'చిత్తచలన కర్దమక్షాళనమే' గీతోద్దేశ్యంగా సూచనప్రాయంగా తెలియజేశారు. చక్రిపాదపద్మాలను ఏకమతితో స్తుతించి గీతను ఆంధ్రీకరిస్తానని ప్రకటించారు. తాను ఆంధ్రీకరించిన గీతను ఆ గీతాచార్యుని పాదపద్మ యుగళీచింతనతోనే ఆంధ్రావళికి సమర్పించారు. మొదటి దైన ఈ సంకల్ప పద్యం తప్ప మరెక్కడ తనదైన భావాన్ని గానీ, తనదైన వర్ణనను గానీ చొప్పించకుండ 'నిష్కామి'గా,'మోక్షగామి'గా, 'శ్రీకృష్ణుని నిజభక్తు'నిగా గీతను యధాతధంగా 'మక్కికి మక్కి'గా తెలుగువారికి సమర్పించారు. సంస్కృతంలో అతి ప్రాచుర్యమైన అనుష్టప్ ఛందానికీ తెలుగులో దరిదాపు పోలికలుగల తేటగీతి ఛందస్సును అనువాదానికి ఎంచుకున్నారు. ఎందరో మహాత్ములను, తత్త్వవేత్తలను, రాజనీతిజ్ఞులను, కవిచంద్రులను ఎంతో ప్రభావితంచేసిన మహతోత్తమమైన భగవద్గీతను ధారారమ్యంగా ఆంధ్రీకరించిన దేశినేని వారికి ఆంధ్రజాతి ఎంతో ఋణపడి ఉన్నది.
- డా. రాధశ్రీ
* * *
తే. సాధు సంరక్షణంబును సలుపుకొఱకు
ధర్మ విద్రోహిజనుల వదార్ధమేను
ధర్మ సంస్థాపనార్ధమై తవిలి తవిలి
యుగయుగంబునఁ బుట్టుచునుందు పార్థ
తే. సాంఖ్య యోగపు సంపూర్ణ సారమంత
కేశవుడు బల్కె నరు మనఃక్లేశముడుగ
పుట్టి గిట్టుట లోనున్న పొట్టి నిజము
తెలుసుకొనెడి ''స్థితప్రజ్ఞు'' విలువ దెలుప
