-
-
శ్రీమాన్ మార్జాలం
Sreemaan Marjaalam
Author: Manchi Pustakam
Publisher: Manchi Pustakam
Language: Telugu
ఈ రంగు రంగుల పుస్తకం చదువుతుంటే, డిస్నీ సినిమా చూస్తున్నట్టుంటుంది.
కథ అబ్బురంగా ఉంటుంది,
తెలుగు పిల్లలు బాగా ఆనందించే లక్షణాలు అన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో.
మీ పిల్లలకు నేడే చదివి వినిపించండి ఈ-పుస్తకాన్ని ప్రపంచంలో ఎక్కడున్నా!
దీంట్లో రెండు కథలున్నాయి. ఒకటి: శ్రీమాన్ మార్జాలం, రెండు: తొలివేట
ఓ పిల్లి ముసలిదైతే, దాన్ని పోషించలేక అడవిలో వదిలేస్తాడు దాని యజమాని. ఓ నక్క దాన్ని పెళ్ళి చేసుకోడంతో, రెండూ కలిసుంటూంటాయి. నక్క మిత్రులైన తోడేలు, ఎలుగుబంటి, అడవి పంది, కుందేలు పిల్లిని మంచి చేసుకోవాలనుకొని, ఓ బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసి పిల్లిని, నక్కని ఆహ్వానిస్తాయి. పిల్లి ఆ విందుకు హాజరైందా? నక్క స్నేహితులకు ఏమవుతుంది? కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
ఓ కుక్కపిల్ల పెరట్లో కోడిపిల్లల వెంట తిరిగి, తిరిగి విసిగిపోతుంది. పక్షులను, జంతువులను వేటాడాలనుకుంటుంది. కంచె దాటి మైదానంలోకి ప్రవేశిస్తుంది. కుక్కపిల్ల ఏయే జంతువులను పక్షులను వేటాడిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.
ఈ కథలకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలు పిల్లలనే కాకుండా పెద్దల్ని సైతం ఆకట్టుకుంటాయి.
