-
-
శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్ర వచనామృతం
Sree saayinaathuni EkaadaSa sootra vachanaamRtaM
Author: Ananda Sai Swamy
Publisher: Self Published on Kinige
Pages: 224Language: Telugu
శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్ర వచనామృతం
ఆత్మదర్శనంతో, బ్రహ్మానుభూతితో, హృదయపూర్వకంగా రచించిన గ్రంథం ఇది.
30 సంవత్సరాల నిర్విరామ విచారణ, - శ్రవణ - మనన - ధ్యాన - సమాధి అనుభూతులతో శ్రీ శిరిడి సాయిబాబా అనుమతితో, ఆదేశంతో, ప్రేరణతో, ఆశీర్వాదంగా నిశ్చయముగా రచించిన గ్రంథమిది.
ఊహలు, భ్రమలు, కల్పితాలు నాకు తెలిసినదే నిజం అనుకునే మూఢత్వంతో రచించిన గ్రంథం కాదిది. బుద్ధితో సాయి ప్రవేశించినప్పుడు, ప్రతి మాట, ప్రతి వాక్యం లోతుల్లోకి వెళ్ళి, ఆ జ్ఞానసాగరంలో ఈదులాడి ఆనందంతో రచించిన గ్రంథమిది.
నా హృదయంలో సాయి ఆశీనులయి, నా కుండలిని జాగృతం చేసి సమాధి అనుభూతి కలిగిస్తూ ఈ గ్రంథ రచన దివ్యం చేసారు. రచనలు చేసే వాళ్ళందరూ సాయి గురించి రచించలేరు. సాయి రచనల్లో సాయిబాబా ప్రమేయం ఎంత పుష్కలంగా ఉంటే, ఆ రచన అంత జీవంతో తొణికిసలాడి - దివ్యమై - ఆధ్యాత్మిక చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంటుంది.
ఈ గ్రంథం సాయిభక్తులకు నిశ్చయంగా ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక భావాలు రేకెత్తిస్తుంది. భక్తి-శ్రద్ధలు పెంచుతుంది. ఏకాగ్రతతో లీనమై చదివిన వారికి కుండలిని జాగృతమవుతుంది. ఎన్నో సందేహాలు పటాపంచలు చేస్తుంది. ఈ కలికాలంలో గురుస్థానం ఏమిటో, గురుశక్తి ఏమిటో, గురు పవిత్రత ఏమిటో, గురు సన్నిధి ఎందుకో తెలుసుకోడానికి ఈ గ్రంథం మహోన్నత సహాయం చేస్తుంది.
ఈ గ్రంథాన్ని మాములుగా చదివి వదిలెయ్యకండి. పారాయణ పేరుతో గడగడ చదివెయ్యకండి. శ్రద్ధతో ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని నెమ్మదిగా, నిదానంగా, ధ్యానిస్తూ, భావిస్తూ, అనుభవిస్తూ చదవండి.
తప్పక మీ ప్రయోజనం -
గ్రంథ ప్రయోజనం నెరవేరుతాయి.
- ఆనందసాయి
