-
-
శ్రీ వేంకట రమణ సాయి భజన గీతాలు
Sree Venkata Ramana Sai Bhajana Geethaalu
Author: U.S.S.S. Kameswara Rao
Pages: 50Language: Telugu
ఈ కలియుగంలో మనం నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ జీవనపోరాటం సాగిస్తున్నాం. మనకి జన్మనిచ్చి మహోన్నత స్థితిని కల్పించిన భగవంతుని స్తుతించే అవకాశం కోల్పోతున్నాం. భగవంతుని భక్తితో ఆరాధించే మార్గాలెన్నో ఉన్నాయి. కానీ ఈ యాంత్రిక యుగంలో సులభతరణోపాయం భగవన్నామ సంకీర్తనం, భగవద్గుణాలను మధురంగా గానం చేయడం. ఇది నవవిధ భక్తిమార్గాలలో ఒకటి.
సంకీర్తనం చేయుటకు ఆధారమైనవి గీతములు. పామరులకు కుడా తెలిసే విధమున అందరినీ ఆకర్షించే సినిమా గీతాల బాణిలో భక్తి పాటలు. భజనలు రచించారు శ్రీ ఉపద్రష్ట శ్రీరామ సాంబ శివ కామేశ్వరరావు. నేటి కాలంలో ఈ గీతాలకు ఆకర్షింపబడని వారెవరూ ఉండరు. కనుక భగవంతుని అనుగ్రహం మనమంతా పొందడానికి వీరు చేసిన కృషి అపారం, అనంతం.
కలియుగంలో సులభంగా అనుగ్రహించే ఆదిదైవం గణపతిని, గ్రహబాధలు నివారించేందుకు మారుతి స్తుతులు, సిరిసంపదల ఖని శ్రీ వేంకటరమణుని గూర్చి, అభిషేకప్రియుడైన శంకరుని, అమ్మలగన్న అమ్మను గూర్చి పలురకాల గీతాలతో గానం చేసి తరించేలా స్తుతించిన వీరిని, వీరి ద్వారా మనలను సర్వదా శ్రీ పద్మావతీ వేంకటేశ్వరులు కామితార్ధములిస్తూ కాపాడుతూ వీరి కలం నుండి ఇంకా ఇలాంటివెన్నో... ఎన్నెన్నో రావాలని ఆకాంక్షిస్తూ...
- సుసర్ల భగవచ్ఛాస్త్రి
