-
-
శ్రీ శివ పురాణం
Sree Siva Puranam
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 136Language: Telugu
భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన పురాణాల్లో శివమహాపురాణం ఎంతో విశిష్ఠమైనది. పరమేశ్వర తత్త్వాన్ని, పరమేశ్వరుడి లీలల్ని విసృతంగా వర్ణించిన ఈ పురాణం, అష్టాదశ పురాణాలలో వాయుపురాణం స్థానంలో వుంటుందని కొందరు అభిప్రాయపడతారు. అయితే అష్టాదశ పురాణాలను గురించి చెప్పే శ్లోకాలలో ఈ పురాణం ప్రస్తావన కనిపించదు కనుక శివ మహాపురణాన్ని స్వతంత్ర పురాణంగానే ఎక్కువమంది పరిగణిస్తారు.
శివ మహాపురాణం సుమారు 26వేల శ్లోకాలతో రచించబడ్డ బృహద్గ్రంథం. ఇందులో మొత్తం ఏడు సంహితలు ఉన్నాయి. 1. విద్యేశ్వర సంహిత 2. రుద్ర సంహిత 3. శతరుద్ర సంహిత 4. కోటి రుద్ర సంహిత 5. ఉమా సంహిత 6. కైలాస సంహిత 7. వాయు సంహిత అనేవి. ఈ ఏడు సంహితల్లో శివ సిద్ధాంతం ఎన్నో ఉపాఖ్యానాలు, స్తోత్రాలు, శివలింగాల చరిత్రలు, తదితర విశేషాలు సవివరంగా చెప్పబడ్డాయి. శైవ సంప్రదాయానికి సంబంధించిన సకల విజ్ఞాన సర్వస్వం ఈ శివ పురాణం.
- ప్రచురణకర్తలు
- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72
It's a useful puranam for me.if I never study I will be die.I love Siva.