• Sree Krishna Bhagavadvijayamu Navala
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 324
  360
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రీకృష్ణభగవద్విజయము -నవల

  Sree Krishna Bhagavadvijayamu Navala

  Publisher: Nigamasri Nilayam

  Pages: 244
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ధర్మరాజుయొక్క రాజసూయయాగానికి అడ్డుపడగల రాజులందఱినీ వరుసగా వధించటమే శ్రీకృష్ణభగవద్విజయంలోని ప్రధానకథాంశం. సాళ్వదేశరాజకుమారులయిన హంసుడు మఱియు డిభకుడు ఉప్పును కప్పంగా పంపవలసిందిగా యాదవులవద్దకు దూతను పంపుతారు. ఆ దూత మాటలు విన్న యాదవులు ఆగ్రహోదగ్రులవుతారు. ఫలితంగా దారుణయుద్ధం జరిగి హంసడిభకులు చిత్రవిచిత్రంగా మరణిస్తారు. ఈ హంసడిభకులకు అధినాయకుడైన జరాసంధుడు ప్రతిరోజూ ఒకరాజును నఱుకుతూ భైరవపూజ చేస్తుంటాడు. భీమార్జునులను వెంటబెట్టుకొని మగధరాజధానిలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు భీమునిచేత మల్లయుద్ధంలో జరాసంధుణ్ని చంపిస్తాడు. ఫలితంగా మగధచెఱసాలలో మ్రగ్గుతున్న మిగిలిన రాజులు ప్రాణాలతో బయటపడి శ్రీకృష్ణస్వామికి భక్తులై ధర్మరాజుకు సామంతులవుతారు. తమచక్రవర్తి అయిన జరాసంధుణ్ని చంపినందుకు శిశుపాలదంతవక్త్రులు శ్రీకృష్ణునిమీద కోపోద్రిక్తులవుతారు. ధర్మరాజుయొక్క రాజసూయ సభామందిరంలోని పెద్దలనందఱినీ నోటికి వచ్చినట్లు దూషించిన శిశుపాలుణ్ని శ్రీకృష్ణభగవానుడు సుదర్శనాయుధంతో వధించి తనలో లీనం చేసుకొని, విశ్వరూపాన్ని చూపి భక్తులను ఆశ్చర్యానందాలతో అనుగ్రహిస్తాడు. వీరరసప్రధానంగా సాగిన ఈ పుస్తకంలో అవసరమైనచోట్ల హాస్యరసం కూడా జతకట్టి పాఠకులను కడుపుబ్బ నవ్విస్తుంది. దీనికి తోడు అక్కడక్కడ శబ్దచమత్కారాలు కనిపించి చదువరులహృదయాలకు పులకింతలు కలిగిస్తాయి. చిత్రవిచిత్రపాత్రలు క్రొత్తగా వచ్చి ఆశ్చర్యానందాలను అందిస్తాయి.

* * *

శ్రీకృష్ణుని కథలు, మహిమలు మొదలయిన విషయాలు భారతభాగవతాలలోనే కాక వివిధపురాణాలలో కూడా ఉల్లేఖించబడ్డాయి. తెలుగులో నాచన సోమన రచించిన ఉత్తరహరివంశకావ్యంలో నాలుగవ అశ్వాసంలో హంసడిభకోపాఖ్యానమనే రసవత్కథాభాగమున్నది. దానిని ప్రధానాంశంగా స్వీకరించి, భారతభాగవతాదుల నుంచి మంచి ఘట్టాలు మఱికొన్ని గ్రహించి, ఒక క్రమప్రణాళికలో కూర్చి అద్భుత రమణీయ సన్నివేశాలను మఱియు పాత్రలను అదనంగా సృష్టించి, మాటలు పాటలు పద్యాలు శ్లోకాలు రచించి సకల జనమనోహరంగా వుయ్యూరు లక్ష్మీనరసింహారావుగారు రసభరితమైన నవలగా నిర్మించారు.

కథా సంవిధానంలో నాచనసోమనాధుని ఫక్కికను అనుసరించినా పెంపుదలలోను, మార్పులు చేర్పులు చేయటంలోను డాక్టర్ లక్ష్మీనరసింహారావుగారు ప్రదర్శించిన ప్రతిభ నాన్యతోదర్శనీయం. ముఖ్యంగా శ్రీకృష్ణ భక్తుడయిన జనార్దనుని పాత్రను చిత్రించిన విధానం, మిత్రులచేత వెళ్ళగొట్టబడిన జనార్దనుణ్ని నారద ప్రేరణతో ద్వారకానగరానికి రప్పించి శాశ్వతంగా శ్రీకృష్ణసన్నిధిలో నిల్పటం మొదలయిన ఘట్టాలు విమర్శకుల ప్రశంసలకు సమర్హాలు. నాచనసోమనాథుడు నాకంనుంచి దిగివచ్చి రావుగారు చేసిన మార్పు చేర్పులను చూస్తే తప్పకుండా అభినందిస్తాడు. హంసడిభకుల తల్లులు, జనార్దనుని తల్లి మఱియు ఇల్లాలు, యాదవ పౌరులయిన పెద సాంబయ్య చిన సాంబయ్యలు, శిశుపాలుని మిత్రుడయిన ఉడుగణపతిశాస్త్రి.... ఇంకా ఇంకా ఎన్నో పాత్రలు లక్ష్మీనరసింహారావుగారి సృష్టి కళావైదగ్ధ్యాన్ని చాటుతున్నాయి. పాత సినిమాలలో వసంతకుని పాత్రను ఆ రచయితలు హాస్యానికే పరిమితం చేయగా డాక్టర్ రావుగారు హాస్యచ్ఛాయలు వదలకుండానే భక్తివైపు మళ్ళించి పరాకాష్ఠకు చేర్చిన కల్పనా శిల్పం భక్తవరేణ్యుల ప్రశంసలకు నోచుకోగలదు. వర్ణన మఱియు సంభాషణల విషయాలలో ఎక్కడ ప్రౌఢ సంస్కృత సమాసం నిర్మించాలో, ఎక్కడ అచ్చతెలుగు పలుకుల కలకండలు అందించాలో, ఎక్కడ రెంటినీ కలిపి జోడుగుఱ్ఱాలలాగా నడపాలో రావుగారు చక్కగా ప్రయోగించి చూపారు. ప్రతి సన్నివేశంలోనూ నరసింహారావుగారి ముద్ర భద్రంగా కనిపిస్తున్నది.

- కుఱ్ఱా లక్ష్మీ తులసమ్మ

Preview download free pdf of this Telugu book is available at Sree Krishna Bhagavadvijayamu Navala