-
-
శ్రీ ఛిన్నమస్తా సాధన
Sree Chinnamastaa saadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112Language: Telugu
శ్రీ ఛిన్నమస్తా సాధన
కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.
దశమహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ ఛిన్నమస్తా దేవి. ఈ దేవినే వజ్రవైరోచనీ, ప్రపంచచండీ అని కూడా అంటారు. వైశాఖమాసం శుక్లపక్ష చతుర్ధి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శాక్తేయ సంప్రదాయంలో ఛిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కష్టతరమైన కార్యాలనైనా అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.
శ్రీ ఛిన్నమస్తా సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ ఛిన్నమస్తా దేవి గురించి, వివిధ రకాలైన ఛిన్నమస్తా మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ ఛిన్నమస్తా అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను.
నమస్కారాలతో....
- డా. జయంతి చక్రవర్తి
- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹72
onlinereading