-
-
శ్రావణి
Sravani
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 222Language: Telugu
"ముక్కూ ముఖం తెలియకపోయినా, ఒక్కసారి కూడా నాతో గడపకపోయినా, ఎంతో పరిచయం వున్నవారిలా నాకు సహాయం చేసారు. బ్రతుకంతా మీకు సేవలు చేసినా మీ రుణం తీరదు.
స్టేషన్‌కి వెళ్ళి అరగంటలో తిరిగి వచ్చేస్తాను. మీకు ఇష్టమైనంత కాలం, మీకు నా మీద మోజుగా వున్నన్ని రోజులూ మీతోనే వుంటాను.... ఇక్కడే ఉండండి" అంటూ వీధి వైపు తిరిగింది.
ప్యాంటు జేబులో వున్న సిగరెట్ ప్యాకెట్‌ని తీసి సిగరెట్ వెలిగించుకుంటూ చిన్నగా నవ్వాడు శ్యామ్‌సుందర్.
తన మీద మోజుతో సహాయం చేయటం జరిగిందని అనుకుంటున్న ఆమెకే సమాధానం చెప్పాలో అతడికి స్పురించలేదు.
శ్యామ్‌సుందర్ తటపటాయింపుని మరోవిధంగా అర్థం చేసుకున్నది రాంబాయి.
"నాకు మొగుడుగా వున్న సన్యాసి ఏదైనా అనుకుంటాడని మీరు భయపడవలసిన అవసరం లేదు... అవసరం అయితే అందరిలోనూ అతగాడిని నిలబెట్టి అడగవలసిన నాలుగు మాటలు అడిగేస్తాను.....
మీరు ఇక్కడే వుండండి... నేను స్టేషన్నుంచి తిరిగి వచ్చిన తర్వాత తీరికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాము"అంటూ మరోసారి అతన్ని హెచ్చరించి మరో అడుగు ముందుకు వేసిందామె.
ఆ మాటలతో వదిలిపోయింది శ్యామ్సుందర్ని ఆవరించుకుని వున్న అసందిగ్ధ పరిస్థితి.
"నీతో గడపడం కోసం నీకు సహాయం చేయలేదు. నీ బిడ్డకు సహాయం చేయాలని అనిపించడం వల్ల ఇలా చేశాను... అంతకుమించి నువ్వు అధికంగా ఆలోచించకు" అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఒకే తరహాలో వుండే మధుబాబు గారి నవలల్లో ఇదొకటి. బొత్తిగా సస్పెన్స్ లేదు. చాలా బోరింగ్ గా వుంది.