• Sramanakam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శ్రమణకం

    Sramanakam

    Publisher: S.R. Book Links

    Pages: 262
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'శ్రమణకం' ఒక పుస్తకంగా రూపుదిద్దుకుని వెలువడడానికి వెనుక దీనికి తొలిజీజం పడ్డ కాలపరిస్థితుల గురించి కొద్దిగా ముచ్చటించవలసి ఉంది.

నేను 1975లో భాషాప్రవీణ చదివేటప్పుడు 'పింగళి - కాటూల' వారి 'సౌందర నందనం' కావ్యం చదివాను. అందులో సుందరి పాత్ర ఒక గొప్ప ప్రేమికురాలిగా, భర్తను విడిచి క్షణమాత్రమైన నిలువలేని ఆరాధకురాలిగా కనిపిస్తుంది. తను కూడా భర్త మార్గాన్ననుసరించి చివరకు బుద్ధుని అనుగ్రహంతో నందుడిని కలుసుకుంటుంది. అంతవరకే కథ. ఆ పాత్రలో తరతరాల స్త్రీ సహజమైన మార్ధవాన్ని ప్రణయ భావుకతను మాత్రమే చూస్తాం, దాని పూర్వాపరాల గురించి చర్చలేదు. ఆ కావ్యం తెలుగు సాహిత్య ప్రపంచంలో రసజ్ఞుల నోలలాడించింది.

అందుకే 1989లో ఎమ్.ఫిల్.లో తులనాత్మక అధ్యయనం క్రింద తెలుగులో 'సౌందరనందం', హిందీలో 'లహరోంకే రాజహంస', సంస్కృతంలో అశ్వఘోషుని 'సౌందరనందం' పరిశీలనకు తీసుకోవటం జరిగింది. సుప్రసిద్ధ హిందీ నాటక కర్త మోహన్ రాకేష్ గారి హిందీ నాటకం చదివాక సుందరి పాత్ర అద్భుతమైన వ్యక్తిత్వంతో నా కళ్ళముందు సాక్షాత్కరించింది. ఆయన పదమూడు పర్యాయాలు ఆ నాటకాన్ని తిరగరాసి, ఆ పాత్రకు అద్భుతమైన మెరుపులు దిద్దారు. ఫలితంగా తెలుగులో లీలా మాత్రంగా కనపడే ఈ పాత్ర హిందీలో మోహన్ రాకేష్ గారి సృష్టిలో పరిపూర్ణతను సంతరించుకుని - పాఠకుల మనసులో ఒక ప్రముఖ స్థానాన్నాక్రమిస్తుంది. అది చదివి ఆ పాత్రను అర్థం చేసుకున్నాక సుందరి మీద నా ప్రేమ, ఆరాధన పదింతలు పెరిగాయి. హిందీ నాటకాన్ని తెలుగులో అనువాదం చేసుకుని ఆ పాత్రను మరింత శోధించేదాకా నిద్రపట్టలేదు.

కాలక్రమంలో అనేక మార్పుల తర్వాత నా భర్త శ్రీ నందమూరి తారకరామారావు గారు పరమపదించాక రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న నన్ను మళ్ళీ సాహిత్య మార్గంవైపు మళ్ళించింది మా గురువుగారైన గంగిశెట్టి లక్ష్మీనారాయణగారే. 1999 ఎన్నికల తర్వాత పూర్తి నిరాశలో మునిగి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు వారే గుర్తుచేసారు. “మీకిష్టమైన 'సుందరి' పాత్రను ఒక మంచి పుస్తకంగా మలచవచ్చుకదా" అని. నాక్కూడా అదే సరైన సమయం అనిపించింది. జర్మన్ ప్రయాణం పెట్టుకుని కూడా రెండు నెలల్లోనే 'శ్రమణకం' అనే పేరుతో ఈ పుస్తకం రాసి ఇంట్లో పడేసి వెళ్ళిపోయాను. మూడు నెలల తర్వాత తిరిగొచ్చి మా ప్రొఫెసర్ గారి దగ్గరే పి.హెడ్,డి చెయ్యటం, మళ్ళీ ఈ పుస్తకాన్ని తప్పొప్పులు సరిదిద్దుకుని ముద్రణకివ్వటం జరిగింది.

- నందమూరి లక్ష్మీపార్వతి

గమనిక: "శ్రమణకం" ఈబుక్ సైజు 8.4 mb

Preview download free pdf of this Telugu book is available at Sramanakam