• Srama veerulu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్రమ వీరులు

  Srama veerulu

  Publisher: Vignana Vedika

  Pages: 96
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

విజ్ఞాన వేదిక (రిజిస్టర్డు), తెనాలి తరఫున మేము చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా 2008వ సంవత్సరం ప్రపంచ శ్రామిక దినోత్సవమైన మేడే సందర్భంగా మా సంస్థ అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై దృష్టి సారించింది. వివిధ వృత్తులు, జీవన రీతులకు చెందిన 36 మంది శ్రమవీరులను ఈ సందర్భంగా సత్కరించాలని నిర్ణయించాం. దాంతోబాటు అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై ఒక ఉపన్యాస వేదిక నిర్వహించి వారి నేటి స్థితిగతులను సమాజం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయాలని కూడా తలపెట్టాం. ఇదే సందర్భంగా దయనీయమైన వివిధ కులవృత్తుల చరిత్రలను నిశితంగా పరిశీలించి, ఆ యా వృత్తిదారుల నేటి స్థితిగతుల వాస్తవ చిత్రణకు పలు ఆసక్తికర విషయాలు జోడించి 'శ్రమ వీరులు' అన్న పేరిట ఒక గ్రంథంగా వెలువరించాలనే యోచన కలిగింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం అత్యంత దయనీయమైన పని పరిస్థితులు కలిగిన 18 వృత్తుల జీవన చిత్రాన్ని పాఠకుల ముందుంచాలని భావించాను. అయితే ఈ తరహా గ్రంథ ఆవిష్కరణకు సరియైన సందర్భం మేడేయేనని భావించినందున, మేడే సభలోపు నేను పూర్తిచేయగలిగిన మేరకు 8 కులవృత్తుల వాస్తవిక జీవన చిత్రాలను మీ ముందుంచుతున్నాను. అలా నా రోజువారీ ఉద్యోగ బాధ్యతలు, సమయాభావం కారణంగా అష్టాథ అధ్యాయాలతో వ్రాయలనుకున్న ఈ గ్రంథం ప్రస్తుతం 'అష్టాధ్యాయి' గా వెలుగు చూస్తున్నది. త్వరలో మరిన్ని వృత్తుల చిత్రణతో వేరొక గ్రంథాన్ని ప్రచురించే యోచనతో ఉన్నాం.

ఈ సందర్భంగా పాఠక మహాశయులకు ఒక మనవి. దయనీయమైన కులవృత్తులలో మ్రగ్గుతూ, స్వేదం చిందించి సంపద సృష్టిస్తూ, సమాజానికి విలువైన సేవలందిస్తున్న శ్రమవీరుల ఋణం ఏం చేసినా తీరేది కాదు. ఐతే ఆ శ్రమవీరుల శక్తి సామర్థ్యాలను, అంకిత భావాన్ని, వృత్తి నైపుణ్యాన్ని మనం ఏ మేరకు గుర్తించి, గౌరవిస్తున్నామనేదే ప్రశ్న. కళాకారుల పట్ల కళాభిమానం ఒలకబోసే మనం మన పూర్వులు పేర్కొన్న 64 కళలలో క్షౌర కళ, రంగులు వేయడం, వంటలు, కుట్టు పని, కుమ్మరి పని, వడ్రంగము, మేదరి పని, కమ్మరపు పని, భవన నిర్మాణం వగైరాలన్నీ ఉన్నాయనీ, కనుక ఆ వృత్తిదారులైన శ్రమవీరులూ కళాకారులేననీ, వారు సమాజానికి చేస్తున్నదీ కళా సేవేననీ, వారిదీ వృత్తి నైపుణ్యమేననీ మాత్రం గుర్తుంచుకోం. పారితోషికం తీసుకుని అయినా సరే ఎవరూ చేయడానికి ముందుకురాని పారిశుద్ధ్యపు పని చేసే శ్రమ వీరుడి సేవలకు గానీ, శ్మశానంలో శవాలను తగులబెట్టే, పూడ్చే పనిచేసే వెట్టి శ్రామికుని సేవలకు గానీ వారికి కృతజ్ఞులమై ఉండాల్సిన అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తాం. జిలుగు వెలుగుల వస్త్రాలునేసే నేతన్న సేవలే కాదు-ఆ వస్త్రాన్ని శుద్ధిచేసే మడేలన్న సేవలూ మనం మరిచాం. సమాజానికి అన్నదాత అయిన రైతన్న సేవలు విస్మరించినట్లే, ఒక చర్మకారుడు, మట్టి పనివాడు, మత్స్యకారుడు, మేదరి వగైరా శ్రమవీరులు సమాజానికి చేస్తున్న అన్ని సేవలూ విస్మరించాం. ఆ విస్మృత శ్రమవీరుల విలువైన సేవలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఆయా కులవృత్తుల చారిత్రక నేపథ్యంతోబాటు వారి నేటి స్థితిగతులను సంగ్రహంగా పాఠకుల ముందుంచడం ఈ రచన లక్ష్యం.

వివిధ వృత్తుల చరిత్రతోబాటు ఆయా వృత్తులకు సంబంధించిన ఐతిహ్యాలను కూడా పాఠకుల సమాచారం నిమిత్తం జోడించడం జరిగింది. దయనీయమైన పని పరిస్థితులలో మ్రగ్గుతున్న ఆయా వృత్తిదారులకు తమ గత వైభవానికి సంబంధించిన ఏ అంశమైనా కొండంత ఓదార్పునిస్తుంది. అందుకే వారు వాటిని సత్యాలని విశ్వసిస్తూ ఆ కాసేపన్నా వారి నేటి హైన్య స్థితిని మరచిపోయే ప్రయత్నం చేస్తారు. పురాణాలు పుక్కిటివని శాస్త్రీయ దృక్పథం కలిగినవారెవరైనా అంగీకరిస్తారు. కుల చరిత్రలన్నీ ఆయా కులాలకు వివిధ పురాణ పాత్రలతో బాంధవ్యం కలుపుతూ వ్రాయబడిన కారణంగా వాటికి కూడా విశ్వసనీయత లేదు. ఐతే పుక్కిటి పురాణాలలోనూ అక్కడక్కడా చరిత్ర రచనకుపయుక్తమైన అంశాలు నిక్షిప్తమై ఉన్నట్లే, వివిధ కుల చరిత్రలలోనూ మనం తెలుసుకొనదగిన చారిత్రక వాస్తవాలుంటాయి. వాటిని పూర్తిగా అసత్యాలని మనం కొట్టిపారేయలేం. ఔత్సాహికులు హేతుదృష్టితో శాస్త్రీయ పరిశీలన చేసి వాటి సత్యాసత్యాలను నిగ్గు తేల్చవలసి ఉంటుంది. ఆయా వృత్తిదార్లు సత్యమని నమ్ముతున్న వారి గత వైభవాన్ని నా సంక్షిప్త వ్యాఖ్యలతో దాదాపు యథాతథంగానే పాఠకుల ముందుంచాను. సదసద్వివేచనాపరులైన పాఠకులు గ్రహించగలరు.

- ముత్తేవి రవీంద్రనాథ్‌

Preview download free pdf of this Telugu book is available at Srama veerulu