• Sphoorty I Love You
  • fb
  • Share on Google+
  • Pin it!
 • స్ఫూర్తీ! ఐ లవ్ యూ....

  Sphoorty I Love You

  Pages: 214
  Language: Telugu
  Rating
  4.63 Star Rating: Recommended
  4.63 Star Rating: Recommended
  4.63 Star Rating: Recommended
  4.63 Star Rating: Recommended
  4.63 Star Rating: Recommended
  '4.63/5' From 19 votes.
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  4.67 Star Rating: Recommended
  '4.67/5' From 3 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి "పద్మ శ్రీరామ్" పంపిన నవల "స్ఫూర్తీ!... ఐ లవ్ యూ".

* * *

KinigeNovelCompetitionLogo
అమ్మను సైతం కన్న జన్మభూమి గొప్పదనం చెప్పడానికి ఎవరికైనా భాషా రాహిత్యమే. అటువంటి జన్మభూముల్లో ఎప్పుడూ తలమానికమై అగ్రస్థానంలో నిలిచే స్థాయి కేవలం మన భారతావనికే ఉందని నమ్మే ఒక శాస్త్రవేత్త కృష్ణమోహన్. తన జీవితాన్ని మరచి జీవితానందాన్ని శూన్యం చేసుకుని తను నమ్మిన నైతిక విలువలను కాపాడుకొంటూ దేశానికి తన విజ్ఞాన ఫలాన్ని అందించడానికి చేసే పోరాటము, ఆ పోరాటంలో అనుక్షణం ఎదుర్కొన్న సుడిగాలుల పర్యవసానమే "స్ఫూర్తీ!...ఐ లవ్ యూ"...

స్త్రీ... అందానికి నిర్వచనం ప్రేమకు ప్రతిరూపం మానవతకు మణిదీపం ఇలా ఎందరో కవులు ఎన్నో విధాలుగా మగువను అగ్రస్థానంలో నిలబెట్టారు... కానీ ప్రేమించే భావన ఒక్క స్త్రీకే పరిమితం కాదు... అంతకన్నా ఎక్కువగా అంతే స్వచ్ఛతతో ప్రేమించిన మగవాడు తన అస్థిత్వాన్ని సైతం మరిచి మనసిచ్చిన మగువ కోసం చేసిన త్యాగానికి ప్రతిరూపం "స్ఫూర్తీ!...ఐ లవ్ యూ".

వలపు... ఒక అనుభూతి... ఒక్కోసారి అప్రాప్త ప్రాప్తమవుతుంది కొందరికి...

వలపు... ఒక ఎండమావి... ఒక్కోసారి తీరని దాహమవుతుంది ఎందరికో...

వలపు... ఒక శీతలసమీరం... అది జరిగిపోయింది కాబట్టి ఆ అనుభూతి అనిర్వచనీయం కాబట్టి...

ఆ వలపు కోసం నైతిక విలువలకోసం తన స్నేహాన్నే త్యాగం చేసి తన మనసుతో విధి ఎంత చెలగాటమాడినా మొక్కవోని ధైర్యంతో తన ప్రేయసి చేయినందుకొన్న మరో కర్ణుని నిర్మల ప్రేమ కథే.. "స్ఫూర్తీ!...ఐ లవ్ యూ".

- పద్మ శ్రీరామ్

Preview download free pdf of this Telugu book is available at Sphoorty I Love You
Comment(s) ...

title chudagane love story anipinchinaa adavallu endulonoo magavaariki teesiporu ani sphoorthi ni ragilche disaga sagindi. aadyantam kadalanika chadivinchindi.samdesatmakangaanu,sphoortidayakanganu unna ee novel manchi novel ani cheppavachu.no doubt at all.

స్ఫూర్తీ ఐ లవ్ యు ఈ పేరు వినగానే.. ఒక మామూలు ప్రేమ కధ అనిపిస్తుంది.. చదవడం మొదలుపెట్టడం.. సాదా సీదా గనే జరిగినా.. పేజీలు తరిగే కొద్దీ.. కుతూహలం పెరుగింది.. యెటువంటి వుపోద్ఘాతాలూ.. లేకుండా.. సూటిగా.. సాగించిన కధనం.. శైలి..మనసుకు హాయి కలిగించింది. విధి ఆడిన వింత నాటకం లో.. పాత్రలు నలిగిన తీరు వివరించడమ్లో.. పద్మగారూ సఫలాయ్యారు.. మొత్తానికి.. హృదయాన్ని కదిలించే సంఘటనలు..గుండెను బరువెక్కించినా.. మంచిపాత్రల జీవితాలు శుభం తో ముగించినందుకు.. గుండె తేలిక పడుతుంది.. మొత్తం మీద.. మంచి నవల. అనిపించుకునే స్థాయిలో ఉందని చెప్పడానికి.. యెటువంటి..సందేహమూ అక్కరలేని నవల ఇది..

స్ఫూర్తిదాయకమైన కధ..వినూత్నమైన శైలి.... ఆద్యంతమూ ఆసక్తికరంగా అలరించగలిగిన కధ...గ్రేట్ పద్మాజీ

మనసును కదిలించినదీ నవల...ఉత్కంఠభరితం..ఆసక్తికరం...మొత్తం మీద నవరసభరితం....

అతి సాధారణమైన పేరు తో నవల ఉన్నా నవలలోని విషయం మాత్రం ఆసక్తికరమైన శైలిలో సాగింది. నవల లోని పాత్ర దారులంతా మన చుట్టూ పక్కలవారే అన్నంత సహజంగా పాత్రల పేర్లతోనే తెలిసేలా రాశారు రచయిత్రి. పాత్రోచితంగా అక్కడక్కడా కనిపించిన కవితలు కొన్ని మనసుకు హత్తుకుపోయేలా రచయిత్రికి భాష మీద భావుకత మీద ఉన్న పట్టుని చూపిస్తుంది. సహజత్వాన్ని ఇష్టపడే వాళ్ళందరూ చదవతగ్గ మంచి నవల ఇది

కినిగే నవలలపోటీకి పద్మా శ్రీరాం గారి "స్పూర్తీ! ఐ లవ్ యు" పుస్తకం చక్కగా హాయిగా సాగిపోయే కథ. వినూత్న శైలి చక్కని భావప్రకటన. కీప్ ఇట్ ఉప్ పద్మా శ్రీరాం గారు.

కథ ఆద్యంతం హృదాయాన్ని కదిలించింది, చాలా బాగుంది

Chala bagunnadi ladies ki spoortidayakam ga unnadi

మంచి నవల చదివానన్న అనుభూతి కలిగింది .మీరిలాగే మరెన్నో నవలలు రాయాలని కోరుకుంటూ .......

మంచి నవల చదివానన్న అనుభూతి కలిగింది , మీరిలాగే ఎన్నో నవలలు రాయాలని కోరుకుంటూ ......

చాలా మాములుగా చదవడం మొదలుపెడతాం నోవెల్ చూడగానే..చదువుతుంటే ఆపడం కష్టం అవుతుంది ఇక... ఎన్ని కష్ట నష్టాలని ఎదురయిన అనుకున్నది సాధించాలి అనే విషయం చాల బాగా చెప్పారు పద్మ గారు.. కథ నడపడం లో తీరు.. అక్కడక్కడ రాసిన కవితలు మనసుకి ఎంతో హాయినిచ్చాయి.. కొన్ని కవితలు అయితే కళ్ళనీరు కూడా పెట్టించాయి..మొత్తంగా కవయిత్రి కి ఇది మొదటి నవల అంటే నమ్మసఖ్యం గా వుండదు ఎవరికీ అయిన సరే.. ముందు ముందు ఇంకా మంచి నవలలు అందివ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. అభినందిస్తున్న..

స్ఫూర్తిదాయకమైన కధ..ప్రతీ చిన్న విషయానికీ బెదిరిపోయే ఆడపిల్లలకు చుక్కానిలాంటి నవల. సమాజం లో రాజశేఖర్ వంటి వ్యక్తులే అధికంగా ఎదురయ్యే జీవితాలలో శరత్ వంటి ఉత్తములు,కృష్ణమోహన్ వంటి ఉదాత్తులూ కూడా ఉంటారు..ఉన్నారు... తొలినవల అనిపించకుండా ఏకబిగిన చదివించావు...పద్మా ! బెస్ట్ ఆఫ్ లక్.