-
-
సౌందర్యలహరి - కథలు
Sowndaryalahari Kathalu
Author: Jandyam Venkatesh Babu
Publisher: Srinandan Book House
Pages: 88Language: Telugu
“మీకెన్నోసార్లు చెప్పాను. నాకు పెళ్ళి వద్దని”
సుగుణమ్మ కూతురు కేసి చిరాగ్గా చూసింది. “అంటే ఈ జన్మకిక పెళ్ళిచేసుకోవా?” “చేసుకోనుగాక చేసుకోను” శ్రీలత స్థిరంగా అంది.
సుగుణమ్మ కోపంగా ఏదో అనబోయిందిగానీ, ఏమనుకుందో ఏమో... కోపాన్ని దిగమింగుకొని సీరియస్గా చెప్పింది. “నువ్వు పెళ్ళిచేసుకుంటావో చేసుకోవో అదంతా తర్వాత సంగతి. రేపు నీకు పెళ్ళిచూపులు. వైజాగ్ నుండి అబ్బాయి వచ్చి నిన్ను చూసుకో బోతున్నాడు. ‘మంచి సంబంధం. ఆ సంబంధం కుదిరితే అది మన అదృష్టం’ అని మీ నాన్నగారు అంటున్నారు. కాబట్టి ఏదేశమయినా నువ్వు పెళ్ళిచూపులకు కూర్చోవలసిందే”.
ఆ మాటలు చెప్పాక ఆవిడ అక్కడ ఉండలేదు.
కూతుర్ని బెడ్రూమ్లోనే వదిలేసి బయటకు వెళ్ళింది.
శ్రీలతలో కోపం, ఉక్రోషం, నిస్సహాయత కలగాపులగమై పిడికిలి బిగించి బెడ్ మీద కొట్టేలా చేశాయి. అలా చేసినా కసి తీరలేదు. చివరకు కోపాన్ని, ఉక్రోషాన్ని, నిస్సహాయత డామినేట్ చేయగా ఏమి చేయలేక ఆమె అలాగే వెక్కి వెక్కి ఏడవసాగింది.
