-
-
సౌందరనందం
Soundanandam
Author: Ravuri Bharadwaja
Publisher: Balaji Granthamala
Pages: 84Language: Telugu
ఈ సంపుటంలోని నాలుగు కథలూ భరద్వాజ 1950 నుండి 1960 మధ్య కాలంలో వ్రాసినవే!
'సౌందరనందం' అన్న కథ అశ్వఘోషుడి 'సౌందరనందం' అన్న సంస్కృత కావ్యాన్ని చటుక్కున స్ఫురింపజేసినా, ఇది అచ్చమైన సాంఘిక కథ. ఇందులోని 'సుందరి' మన తెలుగు కథల్లో తరచుగా ఎదురుపడే మాములు పాత్రలలాగా ఉండదు. కొంత ప్రత్యేకత వున్న పాత్ర. ఈపాటి ప్రత్యేకతలు అంతరంగంలో దాచుకొన్న వ్యక్తులు నాకు చాలా మంది తెలుసు. సుందరి పాత్రలో వున్న విశేషమేమిటంటే, ఆ ప్రత్యేకతను పాత్ర అంతరంగంలోనే ఉంచుకోకుండా, బహిరంగంలోకి తెచ్చి సన్నివేశంలోకి చొప్పించడం ద్వారా కొంత విలక్షణతని చూపించాడు భరధ్వాజ.
మర్యాదస్తులైన ముగ్గురు పెద్దమనుషులు, ఒక స్త్రీ జీవితం ధ్వంసం కావడానికి, ఎలా కారణభుతులయ్యారో 'సినిమాటిక్'గా చెప్పిన కథ 'ఆహుతి'.
'నిన్ను గురించిన నిజం' కథలోని 'సుమిత్ర' పాత్రకూ, 'సౌందరనందం' లోని 'సుందరి'కీ, 'కాదంబరి'లోని 'కౌముది'కి కొన్ని పోలికలు ఉన్నాయి, అలాగే తేడాలూ ఉన్నాయి.
'స్వయంభువు' వీటన్నికంటే భిన్నమైన కథ. భరధ్వాజలో వచ్చిన మానసిక పరిణామానికి ఈ కథ మచ్చుతునక.
- త్రిపురనేని సుబ్బారావు
