-
-
సొరాజ్జెం
Sorajjem
Author: Akkineni Kutumbarao
Publisher: Swechcha Prachuranalu
Pages: 144Language: Telugu
చాలా పరిమితమైన పరిధిలోనే రచయిత మాలల జీవితానికి సంబంధించిన అనేక కోణాల్ని ఈ నవలలో చర్చకి పెట్టారు. వాళ్ల సామాజిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ బంధాలూ, వాటిపైన అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ నవలలో కనిపిస్తాయి. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలో తొలిపాదంలో దళితుల వేదనని అర్థం చేసుకోడనికి ఈ నవల బాగా వుపయోగపుతుంది. ఇందులో చర్చించిన రాజకీయార్థిక సామాజిక స్థితిగతులు ఎంతమేరకు మారాయో, అవి ఎందుకు మారకుండ వున్నాయో కూడా రచయిత తేటతెల్లం చేశారు. ఆ విధంగా ఈ నవల కేవలం జీవితాన్ని ఆవిష్కరించనికే పరిమితం కాకుండా, మారని జీవితాల అసలు కోణాల్ని కూడా అన్వేషిస్తుంది.
- అఫ్సర్
ఈ నవలని ఎందుకు చదవాలి? ఎందుకంటే మన సమీప గతంలో దళితులు ఎలా బతికారో, వారిని అగ్రకులాలు ఎలాంటి పీడనకు లోను చేశాయో తెలుసుకోడానికి చదవాలి. ఇవాళ్టి దళితోద్యమం వ్యక్తం చేస్తున్న ఆగ్రహావేశాల వెనుక ఉన్న నేపథ్యం తెలుసుకోడానికి ఈ నవల చదవాలి. అగ్రకులాల వారు డీక్యాస్టిఫై కావాల్సిన అవసరం ఏమిటో గుర్తించడానికి చదవాలి. 1980ల కాలాన ఒక దళితేతర రచయిత దళిత జీవితాన్ని చిత్రించిన తీరుని తెలుసుకోడానికి ఈ నవల చదవాలి. సంపన్నమైన కోస్తా ప్రాంతంలో దళితులు అనుభవించాల్సి వచ్చిన అవమానాల్ని, పాశవికమైన హింసను తెలుసుకోడానికి చదవాలి.
- గుడిపాటి
