• Sopati Bulletin - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సోపతి బులెటిన్ (free)

    Sopati Bulletin - free

    Publisher: Saahithi Sopathi

    Pages: 36
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణ ఉద్యమం జోరు మీదున్న రోజుల్లో కరీంనగర్‌లో 'సాహితీ సోపతి' పుట్టింది. తెలంగాణ ఆకాంక్షల కోసం, సకల సమాజం నినదిస్తున్న సందర్భంలో, కరీంనగర్‌లో ఆలోచనాపరులైన సోపతిగాళ్ళతో 'వల్లుబండ' తెలంగాణ ఉద్యమ కరీంనగర్ కవుల కవితా సంకలనం వెలువడింది. 2010 జులైలో వెలువడిన వల్లుబండలో 120 మంది కవుల కవిత్వం ఫోర్స్‌గా వచ్చింది. ఇది తెలంగాణ సాహిత్య ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. వల్లుబండలో 17 మంది పాటలు, 103 మంది కవిత్వం తెలంగాణ కోసం ఎలుగెత్తి చాటారు. సరిగ్గా వల్లుబండతోనే 'సాహితీ సోపతి' ఆవిర్భవించి, ఇప్పటి (మే 29, 2018) వరకు 75 పుస్తకాలు ప్రచురించింది. కేవలం ఎనిమిది సంవత్సరాలలో 74 పుస్తకాలు వెలువరించడం సాధారణ విషయం కాదు. ఇందులో 38 పుస్తకాలు కవిత్వం, గేయం, కథలు, వ్యాసాలు, నానీలు కాగా మరో 37 పుస్తకాలు 'ఎన్నీల ముచ్చట్లు' కవిత్వం. ఇవి ఒక మాసపత్రిక స్థాయిలో గత కొన్నేండ్లుగా ప్రతి పౌర్ణమి రోజు విడుదల అవుతున్నవి.

సాహితీ సోపతి గట్టిపునాదితోనే ఏర్పడ్డది. బహుభాషావేత్త డా. నలిమెల భాస్కర్, నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, బూర్ల వేంకటేశ్వర్లు, యం. నారాయణ శర్మ, కందుకూరి అంజయ్య పనికతో మొదలయి, కూకట్ల తిరుపతి, విలాసాగరం రవీందర్, సి.వి.కుమార్, తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజలతో పాటు ఈ నిర్మాణంలో ఇంకా చాలామంది కొనసాగుతున్నరు. సమాజానికి అవసరమైన సాహిత్యాన్ని సృష్టించడం, ఆర్థిక సామాజిక అసమానతలు, సకల దోపిడీ, అంతరాల పీడనలు లేని మానవ సమానత్వ సంప్రదాయాన్ని కొనసాగించే రచనలు సృష్టించేందుకు సోపతి అండగా నిలుస్తున్నది. రాష్ట్రస్థాయిలో పేరెన్నికగల పుస్తకాలను కరీంనగర్ ప్రజలకు సాహితీసోపతి పరిచయం చేస్తున్నది. ఇంకా పుస్తకాల ప్రచురణను మాత్రం ప్రధానంగా కొనసాగిస్తున్నది. 'సాహితీ సోపతి' ముద్రణ అంటే, ఒక సాహిత్య గౌరవాన్ని ఇనుమడింపజేసింది అని అనడంలో అతిశయోక్తి లేదు.

- అన్నవరం దేవేందర్

గమనిక: "సోపతి బులెటిన్" ఈబుక్ సైజు 9.5mb