-
-
సొనకాలువల అపూర్వ పురాగాధ
Sona Kalavala Apoorva Puragadha
Author: Dr. Lenin Dhanisetty
Publisher: Anantudu Foundation
Pages: 35Language: Telugu
ప్రపంచంలోని ఏడు వింతల్ని తలదన్నే సొనకాలువల అరుదైన పర్యావరణ అద్భుతం తాలూకు పూర్వాపర ప్రాకృత గాథను రెండు వందల వేల సంవత్సరాల నుండీ ప్రస్తుతం వరకూ సాదరంగా పరిచయం చేస్తుందీ పుస్తకం... అంతేకాదు మిలియన్ గ్యాలన్ల మంచినీటి నిల్వలను సిలికామైనింగ్ రూపంలో విచ్చలవిడిగా విచక్షణారహితంగా ధ్వంసం చేస్తూ ఆ ప్రాంతం నుంచి వేలాదిమంది ప్రజలను నిర్వాసితులను చేసి ఆ భూమిని భారీ పరిశ్రమలకు పంచిపెట్టాలని కుట్ర చేస్తున్న కోస్తా వ్యాపార/పెట్టుబడి/ప్రభుత్వ భావజాలాన్ని పరోక్షంగా అర్థం చేయిస్తుందీ పుస్తకం.
సొనకాలువల మూలాల్ని శోధించేందుకు లెనిన్ ధనిశెట్టి చరిత్ర, వర్తమానం, భవిష్యత్ మూలాల్లోకి సాగించిన ఆయా అరుదైన శాస్త్రీయ, తాత్త్విక అన్వేషణ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంతే కాదు తెలుగు సాహిత్య చరిత్రలో విభజనానంతరం సీమాంధ్రకు తెలంగాణా యిస్తున్న వొక సామాజిక సమస్యను పరిచయం చేసే మొట్టమొదటి స్నేహపూర్వక సాహిత్య కానుక కూడా.
- ప్రచురణకర్త
