-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
సోమయ్యకు నచ్చిన వ్యాసాలు (free)
Somayyaku Nachchina Vyasalu - free
Author: Vadrevu China Veera Bhadrudu
Pages: 476Language: Telugu
దాదాపు పుష్కరకాలంలో (2000-2012) వాడ్రేవు చినవీరభద్రుడు అనేక అంశాల పట్ల చాలా లోతుగా, తాత్వికంగా, సృజనాత్మకంగా, రసాత్మకంగా సమాజం పట్ల ప్రేమతో, సాహిత్య, సామాజిక, తాత్విక, చారిత్రక విషయాల మీద గొప్ప సమన్వయంతో రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
వీరభద్రుడుగారు ఇప్పటి సమాజంలో అరుదైన ఒక సృజనాత్మక కాంతిపుంజం. ఒక్కోసారి ఈయన ఈ కాలం మనిషేనా అని అనిపిస్తుంటుంది. అందుకే ఒకసారి ప్రముఖకవి వేగుంట మోహనప్రసాద్ గారు 'పునర్యానం' కావ్యావిష్కరణ సభలో మాట్లాడుతూ 'జీవితాన్ని, సాహిత్యాన్ని ఇంత వేడుకగా జరుపుకునే చినవీరభద్రుడిని చూసి ఆశ్చర్యమేస్తుందన్నారు'. అవును నిజమే, ఈ రెండూ వేడుకే. అందుకే ఇన్ని అంశాల్లో పాత, కొత్తల్ని సమన్వయం చేస్తూ, ఆశని, వెలుగుని, శాంతిని, తన రచనల ద్వారా వ్యక్తపరుచగల్గుతున్నారు. కాబట్టే ఈ పుస్తకం శాంతిని, వెలుగురేఖల్ని వెదజల్లుతున్న ఒక జీవనదిలా అనిపిస్తుంది.
ఒక ఫకీర్లాగా, ఒక వేదాంతిలాగా, ఒక బాలసంతులాగా, అంతరంగ బాహ్య ప్రపంచాల జుగల్బందీ సంగీత విన్యాసంలోంచి, తనదంతూ కనిపెట్టుకున్న ఒక రాగాన్ని పాడుతూ వస్తున్న ఈ నిత్యగాయకుడి స్వరగానాన్ని వింటూనే ఉందాం.. కొంత వెలుగు దొరుకుతుంది.
- అల్లపుల్ల గంగారెడ్డి

- FREE
- FREE
- FREE
- FREE
- ₹75
- FREE