-
-
సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీవితం - కవిత్వం
Socialist Sufi Faiz Ahmed Faiz Jeevitam Kavitwam
Author: Wahed
Publisher: Kavisangamam Books
Pages: 212Language: Telugu
”ఫైజ్ లోని విప్లవ భావాలను, సూఫీతత్వాన్ని అంటే ప్రేమతత్వాన్ని కలగలిపి వాహెద్ పరిచయం చేసే పద్ధతి చాలా బాధ్యతతో కూడిందిగాను, ఎకానమీ పాటించేదిగాను ఉంటుంది. కవిలో ఆత్మను - అంటే కవితత్వాన్ని పట్టుకున్న రచన మాత్రమే ఎకానమీ పాటిస్తుంది. అందుకాయన ఒక అర్థవంతమైన అకాడమిక్ పద్ధతి కూడా ఎంచుకున్నాడు. ఫైజ్ పేరు, జీవితం - ఆయనను ఉటంకిస్తూ - కవిత్వం - తన అనువాదంలో, ఉర్దూలో, తెలుగు ఉర్దూ లిపుల్లో ఇచ్చి సాధికారత కల్పిస్తాడు. సమకాలీనుడు కాకపోయిన గాలిబ్ తో (ముఖ్యంగా గజల్స్ సందర్భంగా), తన కన్నా పెద్దవాడు, తన గురువుగా భావించే అల్లమా ఇక్బాల్ తోను పోలుస్తాడు. తరఖ్ఖీ పసంద్ ముసన్నిఫీన్ (ప్రాగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్)కు చెందిన మరో సమకాలీన కవి సాహిర్ లూధియాన్వీతోనూ పోలిస్తే బాగుండేదేమో. ... ఫైజ్ రాసిన తరానాలు, గజల్స్ గురించి కూడా చాలా విలువైన విషయాలు రాశాడు. గజల్స్ సందర్భంగా గజల్స్ కు పెట్టింది పేరయిన గాలిబ్ గురించి రాశాడు. ఫైజ్ పై గాలిబ్ ప్రభావం గురించి రాస్తూనే, ఫైజ్ ఎందుకు ఎక్కువగా గజల్స్ రాయలేదనడానికి చాలా లోతయిన శాస్త్రీయ విశ్లేషణ చేస్తాడు”.
- వరవరరావు
గమనిక: " సోషలిస్టు సూఫి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీవితం - కవిత్వం " ఈబుక్ సైజు 16.3mb
