-
-
సోషలిజమే ఎందుకు
Socialisme Yenduku
Author: Istvan Meszaros
Pages: 88Language: Telugu
ఇస్త్వాన్ మెస్జారస్ అగ్రశ్రేణి ప్రపంచ మార్క్సిస్టు మేధావుల్లో ఒకరు. ససెక్స్ యూనివర్శిటీలో తత్వశాస్త్ర విభాగానికి దశాబ్దంన్నర పాటు నేతృత్వం వహించిన ఆయన ప్రస్తుతం అదే యూనివర్శిటీలో ఎమెరిటస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మార్క్స్ పరాయికరణ సిద్ధాంతంపై ఆయన అధ్యయన గ్రంథానికి ప్రఖ్యాత ఇసాక్డ్యూషర్ పురస్కారం లభించింది. 'పెట్టుబడికి ఆవల' అనే బృహద్గ్రంథం ఆయన మరో ప్రసిద్ధ రచన. దీనికి కొనసాగింపుగా ఆయన 'చారిత్రక సమయం మోపే భారాలు, విసిరే సవాళ్ళు' అనే గ్రంథాన్ని రచించారు. దానిలో ఆయన పైన పేర్కొన్న అన్ని అంశాలను విపులంగా చర్చించారు. ప్రస్తుత ప్రత్యామ్నాయం సోషలిజం ఒక్కటే అన్నది ఆ గ్రంథం నిర్థారణ. ఆ నిర్ధారణలను స్థూలంగా తెలియచేసే ఆ గ్రంథానికి చివరి అధ్యాయం 'సోషలిజమే ఎందుకు' అనేది. దాన్ని ఇప్పుడు మీ ముందుంచుతున్నాము. ప్రధానమైన అంశాలను తెలుసుకునేందుకు ఉపయోగపటంతో పాటు, మరింత అధ్యయనానికి పాఠకులను ఈ చిన్నపుస్తకం పురికొల్పుతుందని ఆశిస్తున్నాము.
- ప్రజాశక్తి బుక్ హౌస్
