-
-
స్నేహబంధం
Sneha Bandham
Author: Ravipalli Narayana Rao
Pages: 139Language: Telugu
Description
జీవితంలో తారసపడే మనుష్యులను, సంఘటనలను ఎన్నుకుని కథలుగా మలిచే సీనియర్ రచయిత శ్రీ రావిపల్లి నారాయణరావు గారు ఇంతవరకూ వ్రాసిన నూట యిరవైకి పైగా కథల నుండి పద్దెనిమిది కథలను ఎన్నుకుని మూడో కథా సంపుటాన్ని తీసుకు వస్తున్నారు.
వృక్షాలకు వ్రేళ్లు ఎలా బలం చేకూరుస్తయ్యో కథలకు ప్రారంభాలూ అంత బలాన్ని చేకూరుస్తాయి. పాఠకుడిని తన గుప్పిటిలోకి తీసుకోగలిగేది ప్రారంభమే. ఆపైన బలమైన ముగింపే పాఠకుడి మదిలో దాన్ని చిరకాలం నిలబెట్టగలిగేది. నారాయణరావుగారి కలానికి ఆ రెండు లక్షణాలూ ఉన్నాయి.
సహజత్వంతో కూడిన మానసిక విశ్లేషణయినా, హాస్యంతో కూడిన వ్యంగ్యం అయినా కథలకు ప్రాణాన్ని పోస్తాయి. పాఠకుల్ని తన వెంట నిస్సందేహంగా తీసుకెళ్లగలుగుతాయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఇంతకు ముందు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి పాఠకుల ప్రశంసలు అందుకున్నవే.
- పి.ఎస్.నారాయణ
Preview download free pdf of this Telugu book is available at Sneha Bandham
Login to add a comment
Subscribe to latest comments
