• Snake
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్‌... స్‌... స్నేక్‌

    Snake

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాము పగబడుతుందా ? మొత్తం భారతీయ పాములు మీద వ్రాసిన నవల. పాముకాటు వేస్తే చనిపోయిన వందమందిలో తొంభై మంది చనిపోయింది పాము కాటేసిందనే ఫీలింగ్‌తోనే... దేవతా పాముల తల మీద నాగమణి ఉంటుందని పెద్ద వాళ్ళు చెబితే విన్నారు. కాని మీరు చూశారా ? అయితే చూడండి, ఈ నవల్లో ఆ అద్భుతమైన ఫోటో.

ఇది మైథిలీ వెంకటేశ్వరరావు రచన

* * *

మొదటిసారి పాములు ఇంత ఖచ్చితంగా పగబడతాయని నిరూపణ అవబోతుందా?

అసలే జాతి పాము? ఓరి శాంసన్‌! ఏ నిముషాన తెచ్చావోగాని ఈ జాతిపాము నాకే వణుకు పుట్టిస్తుందిరా ?

విలియం మనసు పరిపరి విధాలుగా పోతోంది.

ఏం చెయ్యాలి?

అదేమో ధైర్యంగా, నిబ్బరంగా తననే చూస్తోంది. తాను కదిలితే అది పక్కకు వెళుతుంది.

ఎటు పోయినా తాను పట్టుకోలేడు.

ఇవాళ తేలాలి తనో- అదో...

ఏం చెయ్యాలి?

తాను కదిలే వరకు అది కదలదు. తాను కదిలితే అది కదుల్తుంది తప్పుకుంటుంది.

తాను కదలకుండా దాన్ని లేకుండా చెయ్యాలి.

ఎలా... ఎలా... ఎలా....

విలియం ఆలోచిస్తూనే వున్నాడు.

అది చూస్తూనే ఉంది. ఇద్దరిలో ఎవరూ కదలటంలేదు.

ఒకరికి తగ్గవారొకరు.

మనిషీ, పామూ ఎదురెదురుగా అలానే చాలా సేపు చూసుకుంటూ వుండిపోయారు.

ఆ సన్నివేశానికి ప్రకృతి కూడా స్తంభించినట్టు గాలి కూడా ఆడటంలేదు. విలియం శరీరం చెమటతో తిసిపోయింది. శరీరంలో ఉద్రిక్తత పెరిగింది. గాలి లేక పోవటం వల్ల కాదు, విపరీతమైన టెన్షన్‌తో - దానితోపాటు బి.పి. కూడా....

Preview download free pdf of this Telugu book is available at Snake