• Smritipathamlo Swami Vivekananda
    • fb
    • Share on Google+
    • Pin it!
  • స్మృతిపథంలో స్వామి వివేకానంద

    Smritipathamlo Swami Vivekananda

    Author:

    Pages: 584
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్వామి వివేకానంద విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి, బహుముఖ ప్రజ్ఞాపాటవాలను గురించి ఆయన అభిమానుల, అనుయాయుల స్మృతుల, అనుభూతుల సంకలనమే ఈ గ్రంథం 'స్మృతిపథంలో స్వామి వివేకానంద'.

ప్రప్రథమంగా ఈ గ్రంథాన్ని ఆంగ్లంలో స్వామి వివేకానంద శతజయంతి మహోత్సవాలలో భాగంగా 'Reminiscences of Vivekananda' పేరిట 1961లో అద్వైతాశ్రమం, కోల్‌కత్తా వారు ముద్రించారు. ఈ తరం వారు స్వామీజీ ఒక మహోన్నత వ్యక్తిగా తెలుసుకొనేది కేవలం వారి పుస్తకాల ద్వారానే. అయితే దివ్యాంశ సంభూతుడుగా, లోకానికి ప్రకాశాన్ని ఇచ్చే ఆచార్యునిగా, జగద్గురువుగా భాసించిన వివేకానందుని సాంగత్య భాగ్యంతో పునీతులైన ప్రాక్‌పాశ్చాత్య శిష్యుల అనుభూతులు, స్వామీజీ యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని తేటతెల్లం చేస్తాయి. అంతేగాక, ఆ మహోన్నత వ్యక్తితోనే జీవిస్తూ, వారితోనే ఉంటూ, సదా భగవదన్వేషణామృతాన్ని గ్రోలుతూ భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకుంటూ ఆ శిష్యులు గిపిన ఆ క్షణాలు, రోజులు ఎవరికైనా మధురానుభూతుల్ని మిగులుస్తాయి. ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులకు సహితం అదే అనుభూతి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

ఈ పుస్తకాన్ని తెలుగులో మొదట, ఆంధ్రప్రదేశ్‌, రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్‌ వారు 2000 వ సంవత్సరంలో ముద్రించారు. అప్పటి ముద్రణకు తెలుగు అనువాదాన్ని డా.పన్నాల శ్యామసుందరమూర్తి, శ్రీ డి.వి.బ్రహ్మాజీ, శ్రీ పన్నాల జయరామశర్మలు అంకిత భావంతో చేశారు. వారికి మా ధన్యవాదాలు. ఈ ప్రస్తుత ముద్రణ, మూలగ్రంథాన్ని కొద్దిపాటి సవరణలతో స్వామి వివేకానంద 150 వ జయంతి మహోత్సవాలలో భాగంగా ఈ గ్రంథాన్ని మరలా విడుదల చేస్తున్నందుకు సంతసిస్తున్నాను. ఈ పుస్తకంలో స్వామి వివేకానంద దివ్యత్వం, గాంభీర్యం, ఔదార్యం, మానవతా దృక్పథం, హాస్యచమత్కారాలు, ఉద్యమ ప్రణాళికలు కళ్ళకట్టినట్లు దర్శనమిస్తాయి.

- ప్రకాశకులు‌

Preview download free pdf of this Telugu book is available at Smritipathamlo Swami Vivekananda