-
-
శివుడు
Sivudu
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 580Language: Telugu
మధుబాబు రచించిన జానపద నవల "శివుడు"రెండు భాగాలు కలిసిన ఈబుక్ ఇది.
* * *
''అరేయ్ శివుడు... నువ్వు ఇక్కడ వుంటే చీటికి మాటికి ఏదో ఒక తప్పిదం చేసి దొరికిపోతూ వుంటావు. ఇటువంటి శిక్షల్ని అనుభవిస్తూనే వుంటావు. నీకు కావల్సిన ధనం యిస్తాను. ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపో. మంచి నగరంలో నీ గురించి ఎవరూ పట్టించుకోని ప్రదేశంలో సుఖంగా బతుకు...'' అన్నది ఆమె చెమ్మగిల్లిన కనుల్ని పమిటి అంచుతో తుడుచుకుంటూ.
పరిచారికలు అందిస్తున్న పదార్థాలను ఆరగిస్తూనే తల అడ్డం తిప్పాడు శివుడు. ''నా చోటు ఇక్కడే.... నా శ్రేయస్సును కోరుకునే మిమ్మల్నందర్నీ వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను'' ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు.
''ఇక్కడే వుంటే నీ బతుకు ఇంకా దుర్భరం అవుతుందిరా'' అన్నది చారులతాదేవి.
''ఏమీ కాదు. సాగరులవారు మొదట కోపగించినా ఆ తరువాత ఎంతో ప్రేమ చూపిస్తారు... రేపు వచ్చే పౌర్ణమినాడు మా విద్యలన్నిటినీ పరీక్షించి వృత్తివిద్యలు నేర్పించే ప్రయత్నం జరుగుతుంది. ఈ సమయంలో నేను కనిపించకుండ పోవటం ఎలా సాధ్యం?'' అన్నాడు శివుడు.
''నువ్వు ఏ విద్య నేర్చుకోవాలని అనుకుంటున్నావు?'' వినోదంగా చూస్తూ అడిగింది ఆమె.
''సైన్యంలో చేరతాను తల్లీ... గజసైన్యానికి నాయకుడిని అవటమే నా లక్ష్యం. యుద్ధ గజాలను నడిపించటంలో సాగరుల వారి మాదిరిగా నేర్పు సంపాదించుకోవాలి. వారి మాదిరిగా పేరు తెచ్చుకోవాలి'' అన్నాడు శివుడు.
తన పరిచారికల వంక ప్రశ్నార్థకంగా చూసింది చారులతాదేవి.
''కష్టం తల్లీ... సైన్యాధ్యక్షుడు ఒప్పుకోడు... శివుడిమీద అతనికి సదభిప్రాయం ఇసుమంత కూడ లేదు'' వెంటనే చెప్పింది ఒక పరిచారిక.
''పరీక్షిస్తున్నప్పుడు ప్రజ్ఞ చూపిస్తే ఒప్పుకోక ఏం చేస్తాడు? దేవిగారి అభిప్రాయానికి విలువ ఇవ్వకుండ వుండగలడా?'' కోపంగా అన్నది రెండో పరిచారిక.
''పరీక్షలు ప్రారంభం అయినప్పుడు చూద్దాము. ఇప్పటినించే ఆలోచనలుఅనవసరం.'' అంటూ శివుడుకేసి చూసింది చారులతాదేవి. ''నగరంలోకి పోదాం. నీ ఏనుగుల్ని పంపించివేయి'' అని చెప్పింది.
సభా భవనంలో సాగరుల వారి కోపం ఎటువంటి స్థాయిలో వున్నదో చూసి వుండం వల్ల వెంటనే కదలటానికి తటపటాయించాడు శివుడు.
చాలా బాగుంది.
What an excellent narration .awesome book i liked it reading,you will never stop once you start reading this book.
Can i get it PDF format ???
Can we get print book
its very woderfullo book v nice
please give me the link or pdf of this novel
nice novel
finally i opened this
please give it in pdf format
Worth read One time. But I felt it more repetitive prose and pattern. Something is missing in this novel and not fully satisfied with story plot. I am expecting more interesting novels from Madhubabu.
Warm Regards,
Vishnu
very very nice one......