-
-
శివగీతామృతం
Sive Geethamrutham
Author: Katuru Ravindra Trivikram
Pages: 50Language: Telugu
తెలుగు వారికి భగవద్గీత సుపరిచితము. శివగీత అపరిచితము. శివుడు జ్ఞానమునకు మూలమైనవాడు, విశ్వప్రభువు. శివజ్ఞాన సర్వస్వమెరిగిన వాడే సమగ్రపండితుడు.
భగవద్గీత నర-నారాయణుల మధ్య జరిగిన చర్చ. శివగీత శ్రీరాముడు - పరమేశ్వరుడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. ఇది అమూల్యము. అతి రహస్యము. జ్ఞానము అర్హులకు లభించవలెనంటే అది రహస్యముగా ఉండవలసి ఉంటుంది. జ్ఞానమునకు మూల్యము నిర్ణయించగలవారు ఏ లోకములోనూ లేరు. భగవాన్ వేదవ్యాస మహర్షి కృపవలన ఈ అమూల్యమైన జ్ఞానము పద్మపురాణాంతర్గతముగ ఆస్తికులకు లభ్యమైనది.
భగవద్గీత వలెనే శివగీత కూడా పద్ధెనిమిది అధ్యాయములు కలిగి ఉన్నది. అక్కడ 'పార్థాయ ప్రతిబోధితాం' అని ప్రారంభమైతే, ఇక్కడ 'రామాయ ప్రతిబోధితాం' అని మొదలవుతుంది.
శ్రీరాముడు తారకనామబ్రహ్మము. నారాయణుని అవతారము కేవలము లోకహితార్థము శ్రీరాముడు ఉపాధిగా ఈ శివగీత ఉద్భవించినది. ఇది జ్ఞాన సుధాసాగరము. భక్తులకు సులభగ్రాహ్యము గావించుటకు సంక్షిప్తం చేయబడినది. ఇది నిత్యపారాయణ గ్రంథము. చదివిన కొద్ది శివభక్తి స్థిరపడుతుంది.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
