-
-
శివారెడ్డి పీఠికలు
Sivareddy Peethikalu
Author: K. Siva Reddy
Publisher: Palapitta Books
Pages: 500Language: Telugu
శివారెడ్డిగారు రాసిన 'ముందుమాటల'న్నీ ఒకే చోట చదువుకునే అవకాశం కల్పించడం ఈ పుస్తకం ప్రచురణలోని ప్రధాన ఉద్దేశ్యం.
ఈ పుస్తకం చదివితే ఆయా కవులను పరిచయం చేసుకోవచ్చు. ఆయా కవులు, కవులుగా జీవించిన స్థల, కాలలను గూర్చి తెలుసుకోవచ్చు. వారి కవిత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. కొత్త తరం కవులు వస్తు, శిల్పాల పరంగా నిత్యనూతనతను సాధించడానికి కడదాకా కవిత్వరచనను కొనసాగించడానికి అనుసరించవలసిన పద్ధతులను గ్రహించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా శివారెడ్ది వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా, కవితా ఆయన పరిణామక్రమాన్ని, ఆయన కవిత్వ వ్యక్తిత్వాన్ని పునస్సమీ క్షించుకోవచ్చు.
ఈ పీఠికలలో పదే పదే ఆయన చేసిన హెచ్చరికలను పరిశీలిస్తే - నాలుగు దశాబ్దాల ఎడతెగని ఆయన కవిత్వయాత్రకు మూలాలు తెలుస్తాయి. వివిధ సామాజిక, సాహిత్యోద్యమాలలోని సానుకూల అంశాలను తనలో సంలోనం చేసుకుంటూ, ప్రపంచ సాహిత్యాధ్యయనంలో తేలిన సారాన్ని జీవితానికి, సృజనకు అన్వయించుకుంటూ లోపలా, బయటా విస్తృతి చెందుతూ, అగాధమవుతూ, తన కవిత్వ నిర్వహణను ఎప్పటి కప్పుడు చెక్ చేసుకుంటూ సాగుతున్న శివారెడ్డి కవిత్వ ప్రస్థానాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. 'నిబద్ధుడవుతున్నాడంటే విస్తృతమవుతున్నాడని అర్థం,' అని ఆయనే ఈ పీఠికలలో ఒక చోట వ్యాఖ్యానించారు. దానికి ఆయన కవిత్వ జీవితమే మంచి దృష్టాంతం. శివారెడ్డి కవిత్వ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా బేరీజు వేసుకోడానికి కూడా ఈ పీఠికలు మంచి ఒనరుగా ఉపయోగపడతాయి.
- పెన్నా శివరామకృష్ణ
మూడు దశాబ్దాల కవిత్వ విశ్లేషణ – ‘శివారెడ్డి పీఠికలు’పుస్తకం పై సమీక్ష
http://teblog.kinige.com/?p=4245