-
-
శివ అభిషేకాలు పూజలు ధూపములు
Siva Abhishekalu Poojalu Dhupamulu
Author: Mydhili Venkateswara Rao
Publisher: Self Published on Kinige
Pages: 176Language: Telugu
మహా మహా పుణ్యఫలాలని తెలియజెప్పే ఈ పుస్తకంలోని అన్ని విషయాలు మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ మహా మహులు చేసినవీ, సాధించినవి. అవన్నీ ఒక్క చోటికి తీసుకురావటానికి నాకు ఆరునెలలు సమయం పట్టింది. ఇంత చేయటానికి కారణం వక్కటే... భగవంతుని కృప అందరిపై ఉండాలని.
నేను దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించిన తర్వాత అందరిలానే దైవదర్శనానికి వెళ్ళి వచ్చాననుకుంటా. ఓసారి ఓ మహానుభావుడు ఓ ప్రశ్న వేశాడు. 'ఆలయానికి ఎందుకు వస్తున్నావని?'. 'ఇంకెందుకు దేవుణ్ణి చూడటానికీ, సేవించటానికి' అని చెప్పాను. 'దేవుడు అంతటా వున్నాడు కదా, ఇక్కడికెందుకు రావట' మన్నాడు. దానికి నేను 'ఆఁ... కాసింత ప్రశాంతత కోసం కదా...' అన్నాను. 'దానికి గుడికే ఎందుకు ఏ తోటకో వెళ్తే సరిపోతుంది కదా...' అన్నాడు. నాకేం చెప్పాలో పాలుపోలేదు. అప్పుడయన అన్నాడు. 'దేవాలయానికి వెళ్ళేది మీరు దేవుడ్ని దర్శించనికే కాదు... భగవంతుడు మిమ్మల్ని గమనించటానికి కూడా. ఇంకా 'ఓ తండ్రీ... కోటానుకోట్ల ప్రాణులున్నాయి. అంతా నీ బిడ్డలే.. ఇంతమంది బాగోగులు చూస్తూ నన్ను మరిచావేమో... అందుకే ఈ బాధలనూ, కష్టాలనూ, సమస్యలనూ అవమానాలను పడుతున్నాను. నీ బిడ్డను నేను. కాసింత నా సంగతి చూడు అని చెప్పటానికీ, ఆయనకి కనపడి రావటానికి' అని చెప్పాడు. నాకెందుకో అప్పుడు అతను చెప్పేది సరయినది కాదని అనిపించింది. ఆ తర్వాత ఆలోచించగా ఆలోచించగా నిజమనిపించింది. అంత చిన్న విషయాన్ని నేనెలా ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయానని, ఇహపరమైన అర్థం, అంతర్లీన అర్థం రెండు వున్నాయని గ్రహించాను.
ఈ గ్రంథంలోని విషయాలని చదివి ఆచరిచటంతో పాటు పూజాదికాల గూర్చి మీ తోటి వాళ్ళకి చెప్పండి. ఈ పుస్తకం గూర్చి చెప్పకపోయినా పర్వాలేదు. ఇందులోని విషయాలని నలుగురికి మీరు చెబితే నాకు అంతకన్నా మీ నుంచి కావాల్సిందీ ఏమీ లేదు.
- మైథిలీ వెంకటేశ్వరరావు

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28