• Sitaramula Dampatya Vaibhavamu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సీతారాముల దాంపత్య వైభవము

    Sitaramula Dampatya Vaibhavamu

    Publisher: J. Venkateswara Rao

    Pages: 108
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రేయోదాయకమైన ఆదర్శముతో సీతారాముల దాంపత్యము యొక్క అన్ని పార్శ్వములు సహజ సుందరముగా రామాయణ కల్పవృక్షములో చిత్రించిరి. సీతారాముల ముగ్ధప్రేమ, ప్రణయము, కోపతాపములు, అలకలు, వ్యంగ్యభాషణలు, కబుర్లు, కథాకథనములు వర్ణించిరి. అవినాభావమైన వారి ఆదర్శ దాంపత్యమును పలువిధములుగా నిరూపించిరి. దాంపత్య ధర్మ చక్రమునకు అక్షము (ఇరుసు) అయిన గృహిణి సీతాదేవి చిత్రణకు ప్రాముఖ్యము కల్పించిరి. బాలకాండలోని సీతారాముల తొలినాళ్ళ శృంగార-వైరాగ్యముల నుండి, యుద్ధకాండలోని హంస సందేశము వరకు ఎన్నో నూతనమైన రసవత్తర ఘట్టములు వాల్మీకి రామాయణ కథాస్రవంతిని అనుసరించుచునే సృష్టించిరి.

రామాయణ కల్పవృక్షములోని సీత ధర్మ నిర్ణయములో, కర్తవ్య నిర్వహణలో, లౌకిక విషయములలో భర్త చేతిని పట్టుకొని ప్రక్కప్రక్కగా నడుచు సహధర్మచారిణి. అవసరమయినచో ఒక అడుగు ముందు వేయుటకు జంకని ధీర. విశ్వనాథ రామాయణ కల్పవృక్షము ఉదాత్తము, చైతన్యవంతము అయిన ''సీతాయాః చరితమ్‌ మహత్‌''గా రూపొందినది.

ఆదికవి వాల్మీకి మహర్షి తపస్సులో ఉద్భవించి, తరతరములకు మానవ సంబంధముల ఆదర్శ చిత్రణగా నిలిచిన రామాయణము, వేయి సంవత్సరముల తెలుగు సాహిత్యములోని శిల్పనేపథ్యముతో మహాకవి విశ్వనాథ జీవుని వేదనలో ప్రభవించిన రామాయణ కల్పవృక్షము ఆధారముగా కథితమైనదే ''సీతారాముల దాంపత్య వైభవము.''

Preview download free pdf of this Telugu book is available at Sitaramula Dampatya Vaibhavamu