-
-
సిస్టర్ కరుణ
Sister Karuna
Author: Dr.Mantha Bhanumathi
Publisher: Self Published on Kinige
Pages: 74Language: Telugu
పొద్దున్నే ఎనిమిదింటికి భోజనాల గదిలో సందడి మొదలయింది. బల్ల చుట్టూ ఒక్కొక్కళ్ళే చేరుతున్నారు.
"ఇవేళ మీ ప్రోగ్రాం ఏమిటి?" మల్లె పువ్వుల్లాంటి ఇడ్లీలు మరో రెండు వేసుకుంటు అడిగాడు రవిప్రకాశ్, అత్తయ్యని, మామయ్యని.
"ఏముంటుంది.. ఇడ్లీలు తినేశాక నాప్, ఒంటిగంటకి మావిడికాయ పప్పు, ముక్కల పులుసు, వంకాయ కారంపెట్టి కూర, దొండకాయ వేపుడుతో భోజనం అయ్యాక కునుకు.. లేచి టీ తాగాక టి.వీ.. రాత్రి..." అప్పుడే స్నానం చేసి వచ్చిన రావుగారు అందుకున్నారు. సీత కేసి చూస్తూ.
"మరీ చెప్తావన్నయ్యా! అప్పుడప్పుడు గుడికేసి, బజారుకేసి కూడా పెళ్తాం తెల్సా" సీత అన్నగారికి ఇడ్లీలు, సెనగపిండి పచ్చడి చేస్తూ అంది.
"రిటైర్డ్ లైఫ్ అంటే అంతేగా మరి. పైగా పుట్టిల్లు..." రవిప్రకాశ్ భార్య లక్ష్మి అంది. వేడి వేడి కాఫీ కప్పులు అందరి దగ్గిరా పెడ్తూ.
సీత, శ్రీనివాస్ నాలుగు రోజులు గడుపుదామని గుంటూరు వెళ్ళారు, సీత అన్నగారింటికి. రావుగారికి ఎనభై ఏళ్ళు దాటాయి. అందర్నీ ఆటపట్టించడం సరదా ఆయనకి.
"ఇక్కడికి వచ్చిందే రిలాక్స్ అవడానికి. ఇవేళ వినుకొండ వెళ్తున్నాను.. సరదాగా వస్తారా అత్తయ్యా! ఆ చుట్టు ప్రక్కల నలభై వరకూ బోర్ వెల్స్ ప్రారంభించాలి. నాలుగు చోట్ల బర్రెలు పంపిణీ చెయ్యాలి. అరగంటలో తయారవ్వాలి మరి." రవిప్రకాశ్ నెల్ ఫోన్ చేతిలో తీసుకుని సంబర్లు నొక్కుతూ లేచాడు.
"మంచి రిలాక్సేషనే! వెళ్ళండి వెళ్ళండి. హాయిగా ఉంటుంది. కార్లో.. రావుగారు అదోలా నవ్వారు.
సీతకి అన్నగారు ఎందుకు నవ్వుతున్నారో అర్థం అవ్వలేరు.
కానీ సాయంకాలంలోపు అర్ధమైపోయింది..
"లంచ్ ఏమైనా కట్టి ఇయ్యనా?" లక్ష్మి అతిథి మర్యార.
"అఖ్ఖర్లే... వినుకొండలో గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తారు..." రవిప్రకాశ్ సంచీలో ఏవేవో కాగితాలు నింపేస్తున్నాడు. మళ్ళీ రావుగారి మందహాసం.
అదేరో చూద్దాం అనుకున్నారు సీత, స్రీనివాస్లు.
