-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శిరీష కోమలం (free)
Sireesha Komalam - free
Author: Multiple Authors
Publisher: Alambana Prachuranalu
Pages: 272Language: Telugu
శిరీష కథలు శిరీష వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి. ఆమె కథలు కూడా సున్నితంగా మానవీయంగా సాగుతాయి. సరళమైన భాషా, భావ ప్రకటనా శిరీష సాహిత్య ప్రత్యేకతలు. ఏ కథా తన ప్రయోజనాన్ని మరిచిపోదు. తానెందుకు రాస్తున్నానో శిరీష ప్రకటించకపోయినా ఆమె కథలు విప్పి చెబుతాయి. ఆమె మరిన్ని కథలు రాయాలనీ, రాయడం లేదనీ అపుడపుడూ అనిపించేది. కానీ ఆలంబన పిల్లలను చూశాక శిరీష రాసిన, రాస్తున్న కథల విలువ తెలిసింది. అవి యథార్థ జీవితాలు. తన చిన్న పరిధిలో తన చుట్టూ ఉన్న పిల్లల జీవితాలలో మార్పు తీసుకురావడం చిన్నపని కాదు. ఆ పెద్దపనిలో మునిగి, అనారోగ్యంతో పోరాడుతున్న శిరీష కథలు రాయడం లేదని అనుకోవటం సరికాదనీ, ఆమె జీవిత వాస్తవ కథలను నిర్మిస్తున్నదని అర్థంచేసుకున్నాను.
- ఓల్గా
వస్తు వినిమయ, వాణిజ్య ప్రపంచానికి దూరంగా ప్రకృతికి, సహజమైన చిన్న చిన్న ఆనందాలకి దగ్గరగా ఉండాలనుకునేది తను. అదే పంథాలో జీవించింది కూడా, ఎందరో వెంపర్లాడే కీర్తి, ప్రతిష్ట, డబ్బు, దర్పం ఆమె దరికి చేరడానికే భయపడేవి.
వదిన రూపం, వ్యక్తిత్వం పదిలం నా మనసులో. నా ఊహల్లో తను ఒక గంధర్వకన్య నేను చిన్నప్పుడు చదువుకున్న కథలో లాగా, ఏదో కారణం కోసం మన మధ్యకి వచ్చింది. ఎందరితో ఎలా ఎందుకు బ్రతకాలో నేర్పి, ఆ పని పూర్తికాగానే తరలిపోయిన కారణజన్మురాలు.
- శైలజ నంబూరి
గమనిక: "శిరీష కోమలం" ఈబుక్ సైజు 8.9 mb

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE