-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
సింగరేణి సాహిత్యం - శ్రమశక్తుల జీవనం (free)
Singareni Sahityam Srama Saktula Jeevanam - free
Author: Dr. J. Kanakadurga
Publisher: Self Published on Kinige
Pages: 161Language: Telugu
గుంటూరు జిల్లా పిడపర్రు గ్రామంలో 1953వ సంవత్సరంలో జన్మించిన కనకదుర్గ, ఎమ్.ఎ. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఎమ్. ఫిల్ & పి.హెచ్.డి కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసారు. ఆయా యూనివర్సిటీల నుంచి బంగారుపతకాలు, బహుమతులు పొందారు. 1975లో సింగరేణి కాలరీస్ మహిళాడిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా చేరి 2009లో ప్రిన్సిపాలుగా పదవీవిరమణ చేసారు. 1994లో ఆంధ్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయినిగా సత్కరించింది. సింగరేణి సాహిత్యంపై యు.జి.సి మైనర్, ప్రపంచీకరణ సందర్భంలో స్త్రీ-పురుష సంబంధాలపై మేజర్ ప్రాజెక్టులు చేసారు. వివిధ పత్రికా ముఖ ప్రచురణలతో బాటు ఐదు పుస్తకాలు ప్రచురించారు. 1. సింగరేణి సాహిత్యం- శ్రమశక్తుల జీవనం, 2. తెలుగు సాహిత్యం మహిళా చైతన్య ప్రస్థానం, 3. తెలుగు స్వతంత్ర కథా కావ్యాలో స్త్రీ జన జీవన చిత్రణ(పి.హెచ్.డి సిద్ధాంత వ్యాసం), 4. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక - మహిళా జన జీవనం(ఎమ్. ఫిల్. సిద్ధాంత వ్యాసం) 5. సాహితీ సుమాలు - రచనలు(ప్రక్రియా సంపుటి).
ఉద్యోగరిత్యా సింగరేణి బోగ్గుగనుల ప్రాంతవాసిగా ఆ సంస్థకు కళాశాల విద్యకు వారధిగా; కార్మిక స్పృహతో సింగరేణి కార్మిక సాహిత్యాన్ని పరిశీలించటం జరిగింది. పాటలు, గేయాలు, కవితలు, వీధి నాటికలు, కథలు, నవలలు, స్వగతాలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు రూపంలో కార్మికులు రచయితలుగా వ్రాసిన సాహిత్యం సింగరేణి గని కార్మిక సాహిత్యం. తుమ్మేటి రఘోత్తమరెడ్డి, పి.చంద్, రాయి వెంకటయ్య, సామేలు వంటి కార్మికులు మరెంతో మంది కార్మిక కథా రచయితలు కలం పేరుతో వ్రాసిన సాహిత్యం వచ్చింది. కార్మికేతరులైన అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య వంటి వారి రచనలు సింగరేణి సాహిత్యంలో చోటు చేసుకున్నాయి. కార్మికులు గనిపనిలో ఎదుర్కొనే వృత్తిపరమైన సమస్యలను యాజమాన్యం అవగాహన చేసుకుంటే పారిశ్రామిక సత్సంబంధాలు పటిష్ఠమయి ఉత్పత్తి, ఉత్పాదక పెరుగుతుందనీ తత్ఫలితంగా ఆర్ధికాభివృద్ధి కలుగుతుందనీ ఆ సాహిత్యం చదివితే అర్ధం అవుతుంది. గనిలో వృత్తి రక్షణ, జీవిత భద్రత, పని పరిస్థితులు, రక్షణ సదుపాయాలు, జీతం, సమ్మెలు చేయాల్సి రావటం, యూనియన్ లీడర్లు, అధికారుల ప్రవర్తన, కుటుంబ జీవనం వంటి విశయాలలో కార్మికుల యొక్క అసంతృప్తి, అంతర్మథనం, అంతరంగాల ఆవిష్కరణకు వేదిక ‘సింగరేణి గని కార్మిక సాహిత్యం’. కార్మికులే రచయితలు కావటంతో సాహిత్యం వాస్తవికతకు పెద్దపీట వేసింది. సింగరేణి కార్మిక కుటుంబ స్త్రీల చేతన్యం పారిశ్రామిక సంబంధాలలోని కార్మిక కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కరదీపిక కాగలిగింది. యాజమాన్యం కార్మికులకు వ్రాసిన లేఖాసాహిత్యం, ప్రభుత్వవిధానాలు, యాజమాన్యం కార్మికులమధ్య జరిగే సంఘర్షణలు సింగరేణి సాహిత్యంలో కార్మికుల జీవన విధానాన్ని స్పష్టం చేయగలిగాయి.
