• Simply Speak In English
  • Ebook Hide Help
    ₹ 90 for 30 days
    ₹ 480
    480
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సింప్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్

    Simply Speak In English

    Pages: 213
    Language: Telugu, English
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక్కొక్క పదంతో మాట్లాడటం మొదలుపెట్టి పదాలను ఎలా సమన్వయం చేయాలో చెబుతూ, వాక్యాలను ఎలా నిర్మించాలో సుచిస్తూ అత్యంత సులువుగా, అత్యంత ఉపయోగకరంగా, అత్యంత ప్రభావవంతంగా, అర్థవంతంగా రాయబడింది ఈ పుస్తకం.

ఎన్నో సంవత్సరాలుగా పుస్తకాలను పక్కన పెట్టిన వాళ్ళు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగాను ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు వాళ్లకు అవసరమైన రీతిలో గ్రామర్ పాయింట్‌లను తెలుసుకుంటూనే ఎన్నో కీలకమైన సున్నితమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునే విధంగాను ఇంగ్లీషును బోధించే ఉపాధ్యాయులు సున్నితంగా విపులంగా బోధించే విధంగానూ ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దాం.

కొన్ని వందల మందితో ప్రయోగం చేసి, కొన్ని బ్యాచ్‌లను విజయవంతంగా నడిపి అందరి మన్ననలను పొందడమే కాకుండా అత్యంత విజయవంతమైన ఈ పద్ధతి ద్వారా 18 రోజుల్లో ఈ పుస్తకాన్ని పూర్తి చేయ గలిగే విధంగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే విధంగా రూపుదిద్దాము.

రాత్రి సమయంలో లేదా పడుకునే ముందు ఈ పుస్తకంలోని విషయాలను చదివి, కొత్త పదాలను నేర్చుకుని, గుర్తుపెట్టుకొని ఉదయం వాటిని మరల చూసుకొని ప్రాక్టీస్ మొదలు పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము గమనించాం.

మొదటి రోజు నుంచే మాట్లాడడానికి కావలసిన అంశాలతో తీర్చిదిద్దడం వల్ల మీరు ఆశక్తితో చదువుతూ, మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే అత్యంత సులువుగా మాట్లాడొచ్చు. మీరు నేర్చుకున్న ప్రతి అంశాన్ని ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ఏరోజుకారోజు మాట్లాడటం వల్ల ఈ పుస్తకంలో చర్చించిన, సూచించిన టెక్నిక్‌లను పాటిస్తూ ఉండడంవల్ల అత్యంత సులువుగా, సునాయాసంగా, సులభంగా మాట్లాడగలుగుతారు.

మీ స్థాయి, వయసు, పరపతి అన్నిటినీ పక్కన పెట్టండి, మీరు విద్యార్థి అయినా ఉద్యోగస్తులైన, గృహిణి అయినా, వ్యాపారవేత్త అయినా, అధికారి అయినా, ఏ పదవిలో ఉన్నా, ఏం చేస్తున్నా అన్నింటినీ పక్కనపెట్టి విద్యార్థిగా, ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టిన విద్యార్ధిలా మొదలు పెట్టండి. ప్రస్తుత విద్యార్థులే కాదు నిరంతరం బిజీగా ఉండేటటువంటి వారు, 60 ఏళ్ల వయసు పైబడిన వారు కూడా ఈ పద్ధతి ద్వారా నేర్చుకొని ఇప్పుడు అత్యంత సమర్థవంతంగా సరళంగా మాట్లాడుతున్నారు. మరి ఇంక
ఆలస్యం ఎందుకు?
ఎక్కడున్నారో అక్కడి నుండే మొదలు పెడదాం…!

Preview download free pdf of this Telugu, English book is available at Simply Speak In English