-
-
సింహప్రసాద్ 63 బహుమతి కథానికలు
Simha Prasad 63 Bahumati Kathanikalu
Author: Simha Prasad
Publisher: Sri Sri Prachuranalu
Pages: 629Language: Telugu
సమస్యలు, పేచీలు, సమాజ గమనంలో గందరగోళాల జోలికి పోకుండా సహజంగా సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక గతుకు, ఒక గతి, ఒక స్థితి చెప్పి దాన్ని గొప్ప కథానిక కావించే రహస్యం శ్రీ సింహప్రసాద్కు బాగా తెలుసు. శ్రీ సింహప్రసాద్ శక్తి సామర్థ్యాలు సమస్తం అద్భుతంగా కథానికను నడిపించటమే కాదు, అందరికీ నచ్చేటట్లు రాయటంలో ఉన్నాయి. వీటిలో ఉపన్యాసాలుండవు. కానీ ఈ జీవితం ఇలా ఉండాలని పాఠకులు గ్రహిస్తారు. ఈ గ్రహింపు కలిగించటం గొప్ప నేర్పు
- డా. కొలకలూరి ఇనాక్
ఆధునిక కాలంలో వస్తున్న మార్పులు, మానవ సంబంధాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో, మనుషుల్లో ఎటువంటి మార్పులు రావాలో సూచిస్తూ మంచి కథలు రాసిన సింహప్రసాద్ గారికి అభినందనలు.
- అబ్బూరి ఛాయాదేవి
ఈ కథలన్నీ సమకాలీన జీవితం మీద వ్యాఖ్యానాలనిపిస్తున్నాయి. పఠితను డిస్టర్బ్ చేస్తున్నాయి. అది ఉత్తమ కథ యొక్క లక్షణం అని వేరే చెప్పనక్కరలేదు. ఈ కథలలో పుడమి వాసన... స్వచ్ఛమైన మానవ జీవితం వాసన... పుష్కలంగా...!
- పెద్దిబొట్ల సుబ్బరామయ్య
కథ చదివితే కన్నీరు రావాలి. చుట్టూ ఉన్న ప్రపంచం కొత్తగా కనిపించాలి. ఆ కొత్త ప్రపంచాన్ని ప్రేమించాలనిపించాలి. జాగృతం కావాలి. లేదంటే కథ చదివితే అజ్ఞాత వ్యక్తి ఎవరో ఓదార్చి, నిన్నూ, నన్నూ గుండెకు హత్తుకున్నట్టు అనిపించాలి. ఈ అనిపించాలనిపించే లక్షణాలన్నీ నాకు సింహప్రసాద్గారి కథల్లో కనిపిస్తాయి. అందుకే వారి కథలంటే నాకు చాలా ఇష్టం.
- ఎ.ఎన్ జగన్నాథశర్మ
గమనిక: " సింహప్రసాద్ 63 బహుమతి కథానికలు " ఈబుక్ సైజు 29.9mb
