-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శిలలపై చెక్కిన కవిత్వం - హంపి (free)
Silalapai Chekkina Kavitvam Hampi - free
Author: Dasaradh
Publisher: Self Published on Kinige
Pages: 106Language: Telugu
John M Fritz & George Michell రచించిన Hampi Vijayanagara పుస్తకానికి దశరధ్ గారి స్వేచ్ఛానువాదం ఈ "శిలలపై చెక్కిన కవిత్వం - హంపి".
* * *
హంపి శిధిలమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతో ప్రజాకర్షణ కలిగినది కావడం మూలంగా ప్రతి సంవత్సరం వందల వేల మంది యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంది. విసిరేసినట్లుగా ఉండే బండరాళ్ళ కొండలు విరివిగా వ్యాపించి ఉన్న హంపి నేపథ్యం నిరుపమానమైనది. హంపిలోని ప్రతి మలుపు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. యాత్రికులకు ఇంపు, సందర్శకులకు సొంపును కలిగించే ఈ హంపిలో కనిపించే ప్రతి శిల్పం / శిధిలం వెనుక కనిపించని కథలు ఎన్నో!
* * *
"ఒకకొండ కొకకొండ ఊపిరాడగనీని
ఉరిత్రాటి యుచ్చులా నొప్పునొకట
ఒకకొండ నొకకొండ యొడిలోన లాలించి
చుబుకంబు నిమురులా చొచ్చునొకట
ఒకకొండ నొకకొండ ఓడించి యెత్తులో
జబ్బలు చరచులా సాగుటనొకట
ఒకకొండ రజు పేరోలగంబున గట్లు
కొలచి యుండినలాగు కుదురు నొకట
కొండలును రాతిబండలు గూడ నిట్లు
మానవుల చేష్టలం దోనమాలు దద్దు
వరవడి గ్రహంపగా జీర్ణవైభవమల
మరచిపోగల్గుదుమె తెల్గు చరితమందు"
- కొడాలి సుబ్బారావు
( "హంపీ క్షేత్రము")
అనువాదం చేయడానికై రచయిత పడిన కష్టాన్ని అభినందిస్తున్నాను.
కొన్ని సూచనలు: (1) వాక్య నిర్మాణంపై ఇంకా శ్రద్ధ పెట్టాల్సివుంది. (2) పదాల ఎంపికలో జాగ్రత్త పడవల్సివుంది. (3) భాషలో కూడా మార్పు అవసరం.
best book
చాలా మంచి పుస్తకం. ఒకసారి చూచినవారికి మంచి జ్ఞాపకాలను గుర్తు చేసేది, చూడని వారికి చూడాలనిపించేది. పుస్తకము వెనుక చాలా కృషి ఉన్నది. అభినందనలు. ఉచిత దిగుమతికి అనువుగా అందుబాటులో ఉంచినందుకు ప్రశంసలు. పెద్ది సాంబశివరావు, గుంటూరు, 94410 65414