-
-
శిలకోల
Silakola
Author: Mallipuram Jagadeesh
Publisher: Sneha Kala Sahiti
Pages: 150Language: Telugu
ఈ రెండోతరం స్ఫూర్తితో కలం పట్టిన మూడోతరం వారిలో మల్లిపురం జగదీశ్ ఒకడు. నేనెరిగిన మేరకు అతడు అచ్చమైన కొండబిడ్డ కూడా. అందుచేతే అక్కడ గతంలోనూ, వర్తమానంలోనూ ఏం జరిగిందో, ఏం జరుగుతుందో తెలుసుకోగోరేవారికి అతని రచనలు అమూల్యాలనిపిస్తాయి. ఆ కారణం చేతే అతను చేసే ప్రతీ రచనా నేను శ్రద్ధగా చదువుతుంటూను చదివించినంత కాలం.
- కాళీపట్నం రామారావు
* * *
ఆదివాసీల జీవితం, ఆదీవాసీలలోని అంతర్గత పొరలు, కొన్ని దశాబ్దాల కాలం నాటి పరిణామాల పరంపరలో భాగంగా జీవవ సరళిలో వస్తున్న మార్పులు ఈ కథల్లో చిత్రతమయ్యాయి. ఇంత ప్రబలంగా ఆదివాసీల జీవితాన్ని చిత్రించిన కథలు ఇదివరలో రాలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఆదివాసీలు, ఒరిస్సా సరిహద్దులని ఆనుకొనివున్న ఏజన్సీ ఏరియాలోని ఆదివాసీల బతుకు చిత్రణ తెలుగు కథా సాహిత్యంలో కొంచెం విస్తృతిలో రికార్డు కావడం ఇదే మొదటిసారి.
- గుడిపాటి
* * *
నిన్నటి గాయాలకు కారణాలు, కారకులూ తెలుసు. మరి నేటి గాయల గురించినదో? అది జగదీశ్ మాత్రం యెలా చెప్పగలడు? అయినా శిలకోల ధరించమంటున్నారు. బహుశా గాయపడిన వారు శిలకోల ధరించక తప్పదేమో! సాహిత్యం సమాజానికి శిలకోల లనందిస్తుందా? సమాజం సాహిత్యానికి శిలకోల లనందిస్తుందా?
- అట్టాడ అప్పలనాయుడు
* * *
ఉత్తరాంధ్ర నుండి కొత్త కథా కెరటంగా, తొలి ఆదివాసీ సృజన కళాకారుడిగా, కథకుడిగా కొండ కోన మీద నిలబడి తన గొంతు వినిపిస్తున్నాడు చి. జగదీశ్. కథకుడూ, గాయకుడూ అయిన జగదీశ్ కలమూ, గళమూ రెండు ఆయుధాలుగా సాధించబోయే విజయాల కోసం... "శిలకోల"ను సంధిస్తున్న ఈ విలుకాడి కోసం అడవి ఆత్రంగా ఎదురు చూస్తోంది.
- గంటేడ గౌరునాయుడు
The download link sent to you will be in acsm format. To open this file and access the e-book, you need to install Adobe Digital Editions software. This software can be downloaded from the link http://www.adobe.com/in/products/digital-editions/download.html.
Happy Reading.