-
-
శిక్ష
Siksha
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 611Language: Telugu
Description
ప్రింట్ వెర్షన్లో రెండు భాగాలుగా ఉన్న పుస్తకాన్ని ఒకే ఈ-బుక్‌గా అందిస్తోంది కినిగె.
* * *
తల ఎత్తి సరస్వతమ్మవైపు చూస్తే ఆమెకు తెలిసిపోతుందన్న భయంతో తల ఎత్తకుండా ఒంచుకునే కూర్చున్నాడు బాచీ.
“ఏది ఏమయినా ఈమధ్య ఎక్కడ చూసినా ఈ చంపటాలు, నరుక్కోవటాలు చాలా ఎక్కువ అయిపోయాయి. అసలీ ప్రపంచం ఎట్నుంచి ఎటు పోతోందో, ఆఖరికి ఏమైపోతుందో అర్థం కావటంలేదు. పక్కమనిషి కంటె పదిమెట్లు పైనుండాలని ప్రతివాడికీ యావ ఎక్కువైంది.
ఉచ్ఛం నీచమనే మాటల్ని గురించి ఆలోచించటంలేదు. ఎంతకయినా సరే తెగబడిపోతున్నారు.
ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలని ఛండాలపు పనులన్నీ చేసి ఛస్తున్నారు” తన మానాన తను ప్రస్తుత పరిస్థితులపై ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోతున్న సరస్వతమ్మ, బాచీ ముఖంలోని భావాల్ని గమనించలేక పోయింది. మార్కెట్ దగ్గిర రిక్షా దిగి, ఖాళీబుట్టల్ని అక్కడ రెడీగా వున్న కూలీలకు అప్పగించింది.
Preview download free pdf of this Telugu book is available at Siksha
Good book time pass