-
-
సిద్ధార్థ
Siddhartha
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 136Language: Telugu
Description
ఎవరీ సిద్ధార్థుడు?
బౌద్ధుడా? జైనుడా? సిద్ధుడా?
ఒక కోణంలో బౌద్ధుడనిపిస్తాడు.
మరొక కోణంలో జైనుడనిపిస్తాడు.
ఏ కోణంలో చూసిన ఏ సంప్రదాయానికీ లొంగనివాడు. ఏ సిద్ధాంతాలకూ అందనివాడు. స్వేచ్ఛకు మరోపేరుగా నిలిచినవాడు. సంసారబంధానికి మరో అర్థాన్నిచ్చినవాడు. సన్యాసాన్ని ప్రాపంచికంగా నిర్వచించినవాడు.
నిజానికి సిద్ధార్థుడు మనమధ్యనే నిత్యసాధకుడిలా చరిస్తూనే ఆత్మజ్ఞతతో పరిణతి చెందినవాడు. ప్రేమానుబంధాల మధ్య సమాధికి చేరినవాడు. ఏ మలుపులోను పారిపోవటం చేతకానివాడు. ఆలోచనలను వదలి శూన్యంలో స్థిరపడినవాడు. గమనాన్నే గమ్యం చేసుకున్నవాడు.
అందుకే ఈ పుస్తకంలో పదలయలో కనిపించే సిద్ధార్థుడు ఒకరు, పధలయలో అగుపించే సిద్ధార్థుడు మరొకరు. అక్షరాల మధ్య సిద్ధార్థులం కాగలిగితే మనలోనే ఆ సిద్ధార్థుడు సాక్షాత్కరిస్తాడు.
Preview download free pdf of this Telugu book is available at Siddhartha
Login to add a comment
Subscribe to latest comments
