• Shyaamyaanaa
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 162
  180
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • శ్యామ్‌యానా

  Shyaamyaanaa

  Author:

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

రచయిత స్వంత మాటల్లో

నా నడక

ముందు
గాలి THRUST వల్ల నడిచాను

తరువాత
నడవాలని నడిచాను

ఇప్పుడు
నడవలేక ఆగాను

ఆగి
గతం తలచాను. ఔను!

ఇంతకీ
నేనెలా నడిచాను ? -

అసలు
నడిచానా ?

-మెడికో శ్యామ్

Preview download free pdf of this Telugu book is available at Shyaamyaanaa
Comment(s) ...

ఈ పుస్తకం యొక్క పరిచయం కినిగె బ్లాగుపై

మీ కథల సంపుటిలోని కథలన్నీ జాగ్రత్తగా చదివాను. మీ కథనం, శైలి చాలా బాగున్నాయి. మీరు కథలు వ్రాయడం ఎలా అన్న వ్యాసంలో చెప్పినట్లు కథలు ఎలా పడితే అలా వ్రాయవచ్చు. నచ్చిన వారికి నచ్చుతాయి. నచ్చనివారికి నచ్చవు. అన్ని కథలు అందరికీ నచ్చేలా వ్రాయలేం. కథ వ్రాయడానికి ఏ సూత్రాలూ లేవు. ఉన్నా ఆ సూత్రాలు బద్దలు కొట్టి కథలు వ్రాస్తూనే ఉంటారు. అందుచేత ఏది కథ, ఏది కథ కాదు అన్నది చెప్పడం కష్టం.
మీ శైలి విలక్షణమైన శైలి. వాక్య నిర్మాణం చాలా బాగుంది. తమాషాగా ఉంది. ఉదాహరణకు ఆలోచన ట్రెయిన్‌లో
మీరు అబ్బాయి అనుకోండి....
నేను అబ్బాయి అనుకోండి. పాకెట్‌లో మనా దాచొచ్చు.
నేను అమ్మాయి అనుకోండి.... అన్న సంభాషణ చాలా తమాషాగ, కొత్తగా ఉంది.
అలాగే,
దాచేస్తే దాగని సత్యం ఆంధ్రపుత్రిక నేడు వంటరాని వనిత.
యవ్వనం ఒక అశాంతి వనం.
తల ప్రాణం ... తోక లేకపోవడం వలన ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది.
ఒంటరి జీవితంలో వెళ్ళిపోయిన వెన్నె నీడలే కాని పడుతున్న వెన్నెల సోనలు లేవు.
లాంటి వాక్యాలు చాలా బాగున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అన్ని కథల్లోనూ మీ వాక్య నిర్మాణం అద్భుతంగా ఉంది.
మీ కథల్లో యవ్వనం చేసే అల్లర్లు గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి. నేను హాస్యం కథలు వ్రాస్తాను కాబట్టి, హాస్యం అంటే ఇష్టబడతాను కాబట్టి, మీరు కూడా ప్రతీ కథలోనూ ఎక్కడో అక్కడ హాస్య సంభాషణలు చొప్పించారు కాబట్టి నాకు అన్ని కథలూ ఇష్టమే కాని ఐసిసియు కథ చాలా నచ్చింది. ఇల్లాంటి కథలు మీలాంటి డాక్టర్లు మాత్రమే వ్రాయగలరు. గోడ గడియారం కథ చెప్పడం చాలా బాగుంది.

సాహిత్యం మీద మీరు వ్రాసిన కథలు సాహిత్యం, కథ, కవిగారి కళత్రం, హంతకుడి కథ, కథకుడి కథలాంటి కథలలో రచయితల మీద, విమర్శకుల మీద మీరు వేసిన బాణాలు చాశాక మీ కథల గురించి ఏమైనా వ్యాఖ్యానించడానికి సాహసం కావాలి. శాయి గారు అన్నట్లు మీరు వాకింగ్ ఎన్‌సైక్లోపేడియా. నేను తెలుగులో కాని, ఇంగ్లీషులో కాని ఎక్కువ సాహిత్యం చదవలేదు. నేను రావిశాస్త్రి, కారా మేష్టారు, ముళ్ళపూడి వెంకటరమణ, ఇగ్లీషులో పి.జి. వోడ్ హౌస్ చదివాను. దాదాపు వారి ప్రతీ రచన చదివాను. చదివిందే మళ్ళీ మళ్లీ చదివే వాడిని. నా మీద వీరి రచనలు ప్రభావం చాలా ఉంది. చెదురు మదురూ ఇతర రచయితల్ని చదివినా పెద్దగా సాహిత్యం చదవలేదనే చెప్పాలి. అల్లాంటి నేను మీ కథల మీద ఏ కామెంటు చేసినా హాస్యాస్పదంగా ఉంటుంది. అయినా మీరు నిర్మొహమాటంగా చెప్పమని అన్నారు కాబట్టి నా దృష్టికి వచ్చిన ఒక విషయం గురించి చెబుతాను.
మీ కథలన్నింటిలోనూ పాత్రలన్నింటిలోనూ శ్యాం కనుపిస్తాడు. రచయిత పాత్రల వెనక దాగుని ఉండడం జరుగుతూనే ఉంటుంది. కొన్ని కథల్లో శ్యాం పాత్రని డామినేట్ చేస్తున్నాడనిపిస్తుంది.
ఉదాహరణకు ఇది మా కథలో మీ గొంతు అన్ని పాత్రల గొంతులోనూ వినిపిస్తుంది.
నాన్న – దిగిరాను, దిగిరాను, దివినుండి భువికి...
అమ్మ – ఒక దోసెడు సానుభూతీ, ఒక బారెడు తీరు బాటూ
అన్న – శ్రీ అంటే సిరి... శ్రీ అంటే విషం.
తమ్ముడు – కన్నె కాటుక కళ్ళ కోకిలమ్మ పెళ్ళే..
సముద్రముల పడిపోవడమా? ఉరి పోసుకు చనిపోవడమా?
చెల్లెలు – బహుశా సినిమా పాట అనుకుంటా - ఆ పాలపుంత కౌగిలిలో
ఆ ఇంట్లో అందరికీ విపరీతంగా సాహిత్యాభిమానం ఉందనుకున్నా, అవి రచయిత మాట్లాడుతున్నట్లుగానే ఉంది కాని పాత్రలు మాట్లాడుతున్నట్లు లేదు.
నాకు నచ్చని మరో విషయం ఏమిటంటే మీరు ఇంత గొప్ప కథలు వ్రాసి, సడెన్‌గా ఆపేశారు. మీరు ఆపకుండా మళ్ళీ కలం పట్టి హుషారుగా రచనలు చెయ్యాలని నా కోరిక. వయసు, అనుభవం తోటి మీ కలం మంచి ఐసిసియు లాంటి మరిన్ని గొప్ప కథలు రావాలి.
-- తోలేటి జగన్మోహనరావు.

హాలికులైననేమి? అన్నాడు కవి. ఆల్కహాలికులైననేమి? అన్నాడు ఆధునిక కవి. విన్నాడు భవదీయుడు ........"ఇది మా కథ" లోని వాక్యము. ఇలాంటి పదాలతో వాక్యాలు ఎవరికి సాధ్యం? నా ఉద్దేశ్యంలో మెడికో శ్యాంకే. అలనాటి పోతనను, ఆనాటి అన్నమాచార్యను ఈనాటి వచనంతో తలపించే నవ పద బంధాల కర్త మెడికో శ్యాం.

గత శతాబ్దంలో డెబ్బయ్ దశకంలో వ్రాసిన కథలు, ఈ శతాబ్దం ప్రథమ దశాబ్దాంతంలో ప్రచురించిన "శ్యాంయానా మెడికో శ్యాం కథలు" చదువుతుంటే ఏదో అనుభూతి, ఏదో ఆహ్లాదం. నీరు దొరక్క, పల్నాటి సీమలో శ్రీనాథుడు చాటువు చెప్పిన వెంటనే శివుడు విడిచిన గంగ ముంగిటికి వస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి అనుభూతి ఈ పుస్తకం చదివితే అని నా అభిప్రాయం.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్‌లో యం. డి. చేసిన లబ్ధ ప్రతిష్టులు కోకొల్లలు కాకపోయిన 'వె'కొల్లలు ఉండవచ్చు. (డాక్టర్. శ్యాం లాగ)

కాని, ఇలాంటి కథలు వ్రాసే మెడికో శ్యాం మాత్రం రేరెస్ట్ ఆఫ్ రేరే.
శ్యాం ఈ మధ్య కథలు వ్రాయడం లేదు............. ఎందుకో?
అర్థాపేక్ష, కీర్తి కాంక్షలు లభించాక వ్రాయడం మానేసాడేమో!
లేదా, తన మాటల్లోనే "అర్థంకాని కనపడని 'ప్రయోజనం' వలన కలిగిన అనాసక్తత" కూడా కారణం ఏమో!

"తేడా" చదివితే మెడికో శ్యాంకు మిగిలిన కథకులకూ మధ్య తేడా తెలుస్తుంది.
"భార్యాటికుడు" ఎవరో అని తెలుసుకోవాలి అంటే "కవిగారి కళత్రం" చదవాలిసిందే.
"గీత" కు కొత్త పర్యాయ "పదం" చెప్పిన ఘనత మెడికో శ్యాందే.
కథకు ఏదీ అనర్హం కాదు అంటూ తెలిపేదే "లీవ్ ఇట్"
ఒక్కొక్క కథ ఒక్కొక్క ఆణిముత్యం ఇప్పుడు నాకు ఒక్కటే దిగులు. ఇలాంటి కథకుడు కథలు వ్రాయక "గాలి మేడల అమెరికాలో" ఏమి చేస్తున్నట్టో.

-- వింకో సంపత్

ఈనాడు పత్రిక రివ్యూ సరికొత్త వాక్యం

'నాకున్న చిన్న సెక్టోరియల్ రీడర్‌షిప్ నాకు చాలు'... ఇది దాపరికంలేని రచయిత ప్రకటన. సంప్రదాయ 'కథ'కు బిగించిన చట్రంలో సరిగా ఇమడని 27 రచనల సంపుటి 'శ్యామ్‌యానా'. విశాఖపట్నంలో వైద్యం చదివి, వృత్తిలో రాణించి, అమెరికాలో ఉన్న మెడికో శ్యాం (డాక్టర్ శ్యామ్ చిర్రావూరి) ప్రయోగశీలి. అనుభూతుల్ని భావధారగా ప్రవహింపచేస్తూ కథా ప్రక్రియకు విలక్షణ రూపం ఇచ్చారు. చల్ల చిలికి వెన్న తీసినట్టు పాఠకుడు మేధోమధనం చేసి ఇతివృత్తం పట్టుకోవాలి. ప్రాసలు, శబ్దవిన్యాసాలు, ఉపమలు, చమత్కారాలు, పదబంధాలు, ధ్వని, వక్రోక్తి వినూత్న వాక్యనిర్మాణం, కవితాత్మకశైలి వంటి గుణవిశేషాలు నింపుకున్న కథలివి. అంతర్లీనంగా తాత్త్వికత చోటుచేసుకుంది. సగం పేజీ నుంచి పది పేజీల దాకా ఉన్న రచనలు తెలుగు కథా క్షేత్రంపై వీచిన కొత్త పవనాలు.

ఈ పుస్తకావిష్కరణ గురించి సాక్షి దినపత్రికలో Sakshi Article Link

ఈ కథల సంపుటిని టెక్సాస్, ఆస్టిన్‌లో విడుదల చేసినప్పటి సదస్సు సమీక్ష అఫ్సర్ బ్లాగులో ఇక్కడ -- http://afsartelugu.blogspot.com/2011/03/blog-post_20.html

తిరుపతిలోని SVIMS లో వైద్య శాస్త్ర ఆచార్యులు డాక్టర్ అల్లాడి మోహన్ గారు పుస్తకం డాట్ నెట్లో ఈ కథల సంపుటి గురించి -
"తెలుగు కథలు చదవడం మొదలుపెట్టినప్పటినుంచి, నన్ను ఆకట్టుకున్న రచయిత ’మెడికో’ శ్యామ్."
పూర్తి రివ్యూ లంకె = http://pustakam.net/?p=6572