-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
శివ - 2 (free)
Shiva 2 - free
Author: Dr. B. Chittaranjan Rao
Publisher: Self Published on Kinige
Pages: 46Language: Telugu
నేను ఈ నవల ఎందుకు రాసినానో తెలిపే ముందు, మీకు నా సినిమా అభిరుచుల గురించి చెప్పాలి. నేను అక్కినేని నాగార్జునగారి మంచి అభిమానిని. నేనే కాదు మా ఇంట్లో అందరు చాలా వరకు నాగార్జునగారిని ఇష్టపడతారు, ఆయన సినిమాలు అంటే మా అందరికీ ఇష్టము. ఎందుకంటే అప్పటివరకు వచ్చిన అందరూ తెలుగు సినిమా హీరోల కన్నా కూడా ఆయన స్టైల్ వేరెగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది.ఆయన సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని మేము అనుకుంటాము, అందుకే ఆయన అంతగా మాకు నచ్చుతారు. ఇక రాంగోపాల్ వర్మగారి గురించి అందరికీ తెలిసిన విషయమే, శివ సినిమాను ఒక కొత్త రకంగా చేశారు. అది తెలుగు సినిమాలు తీసే విధానాన్ని మార్చేసింది అంతగా బాగుంది. అందరూ తెలుగులో ఇలాంటి సినిమాలు అప్పటివరకూ ఎవరు తీయలేదు అంటారు, కానీ నా అభిప్రాయం ఏంటంటే?మొత్తం భారతదేశ సినీ చరిత్రలో ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు ఇది నిజం. నేను మాత్రం ఈ శివ సినిమా నాగార్జునగారి గురించి చూశాను, అందుకే దర్శకుడు ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. రెండు సంవత్సరాల తరువాత అనుకుంటా ఒక రోజు నేను, నా స్నేహితుడు రోడ్డుపై నడుస్తున్నాము అక్కడ రాత్రి సినిమా పోస్టర్ ఉంది. అది చూసి నా స్నేహితుడితో ఆ పోస్టర్ ఏదో ప్రత్యేకంగా ఉందని, విడుదల అయితే ఆ సినిమా తప్పకుండా చూడాలి అని చెప్పాను. దానికి అతను అది దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా అని తప్పకుండా బాగా ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు నేను రాంగోపాల్ వర్మ ఏ సినిమాలు తీశాడు అని అడిగినాను. దానికి అతను శివ ఇంకా క్షణ క్షణం సినిమాలు అని చెప్పాడు. అప్పటి నుండి రాంగోపాల్ వర్మ సినిమా ఏదైనా చూడాలి అని అనుకున్నాను. 2009 లో శివ పేరుతో రాంగోపాల్ వర్మ మరోసారి సినిమా తీశారు, ఈ సారి ఫ్లాప్ అయింది. కొద్ది రోజుల తరువాత నేను నాగార్జున గారిని ఒక టివి ఇంటర్వ్యూలో చూపాను, అందులో తాను రాంగోపాల్ వర్మగారికి శివ-2 తీద్దాము అంటే అతను వద్దు అన్నీ శివ 2009 తీశారు అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది నిజంగా శివకు కొనసాగింపు ఉండాలి అని, అయితే నేను మాత్రం సినిమా తీయలేను. మరి నా అభిమాన హీరో కోరిక ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉంటే సినిమా తీయలేను కానీ దానికి కథ రాయవచ్చు కదా అని తట్టింది నాకు. కానీ శివ కథను ఎలా కొనసాగించాలి? అనేదే పెద్ద సమస్య. శివ సినిమా ఒక సంపూర్ణమైన కథ, కొనసాగింపుకు అవకాశాలు లేవు. నేను బాగా ఆలోచించాను ఏమి తట్టలేదు, అప్పుడు శివ సిడి తెచ్చుకొని కంప్యూటర్లో కాపీ చేసి చాలాసార్లు చూశాను, కష్టంగా అందులో కొన్ని అవకాశాలు కనబడ్డాయి, వాటిని ఆధారం చేసుకొని దానికి కొనసాగింపుగా రాసినదే ఈ శివ 2 కథ. ఇది, అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
- డా. చిత్తరంజన్
