-
-
షాజీ & వాగ్గేయకారులు
Shaji And Vaggeyakarulu
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 70Language: Telugu
ప్రకృతికో, మాయకో, కాక భావనాప్ర
పంచ సౌదామినికో, తపః ప్రభకొ, శూన్య
మునకొ, యానందరూపమై మోదమొసగు
సాత్వికవ్యక్తికీ నమస్కారశతము.
కన్నెమైత్రేయి పాదులుగట్టి నీరు
వోసి, పెంచిన ప్రాబల్కు పొదలయందు,
జాలుగొన్న నైసర్గిక సౌరభములు
మించి, నా పేదయెడద వాసించుగాత!
పదముల పసందు మధుర భావముల పొందు
పందెముల వైచుకొని, కూడబారినట్టు,
లిల పులకరింప, రత్నాలునిలుపు సుకృతి
ప్రాణములనిత్తు మా సేతుబంధకవికి.
తలపునులివెట్టు చాపల్యములనువదలి,
జీవమయమైన రస ముపాసించినట్టి
ఓ కవిబ్రహ్మ! తీర్పలేమోయి నీవు
మునుపు మాతల నిల్పిపోయిన ఋణంబు.
*****
సంగీతమునకు రాగము బ్రధానమంటిమి. పదమేమో చిన్నదే. దాని పరివారము గంపెడు. మూర్ఛనలు-గ్రామములు-గమకములు మొదలైనవి. వారి వావాది స్వరసంచయమును; గమకములేని రాగము రోగమే. ప్రపంచమునందే భారతదేశ సంగీతమునకొక వైశిష్ట్యమును దెచ్చిపెట్టినది గమకము; పాశ్చాత్యులు రాగము నెఱుఁగరు. వారి గానమంతయు స్వరములే. ఆ స్వరములును - వాగ్గేయకారుడు గూర్చినవే.

- ₹270
- ₹378
- ₹72
- ₹216
- ₹108
- ₹72