-
-
షడ్వర్గ బలం
Shadvarga Balam
Author: Vadrevu Suryanarayana Murthy
Publisher: Self Published on Kinige
Pages: 43Language: Telugu
ఈ చిన్న పొత్తము షడ్వర్గబలమను పేర వ్రాయబడినది. ఈ పుస్తకము చిన్నదయినను ఇందు వ్రాసిన విషయములు చాలా ముఖ్యమైనవి. ఈ గ్రంథమున షడ్వర్గబలమును గురించి మాత్రమే వ్రాసినాను. షడ్వరు గురించి చెప్పుటయే గానీ వాడుకలో జ్యోతిష్కులు సరిగా వాడుటలేదు. ఈ షడ్వరు అననేమియో, ఈ బలము నెట్లు ఉపయోగించవలెనో, దీనిని గురించి యున్న అభిప్రాయబేధము లేవియో ఇందు వ్రాసినాను. వీటి సాధన ఉపయోగము వ్రాసి కొన్ని ఉదాహరణములను కూడా ఇచ్చినాను. వీటికి ఉదాహరణములు యోగావళి ఖండమున చాలా వరకు విశదీకరింబడుటచేత తిరిగి ఇందులో వ్రాయుట అనవసరమని వ్రాయలేదు. వరాహమిహిరాదులు షడ్వరులను కేవలము సంజ్ఞల క్రిందను వ్రాసినారు. రాజయోగ విషయమున అంత ఎక్కువగా వాడియుండలేదు. వీరి మతము ప్రకారము షడ్వరు బలము ఏ గ్రహమున కెంతో నిర్ణయించి తద్వారా వచ్చిన బలముచే యోగము గాని, అవయోగము గాని నిర్ణయించవీలులేదు. కాళిదాసు వ్రాసిన సప్తవర్గ బలము ప్రతి గ్రహమునకు బలనిర్ణయమునకు పనికివచ్చును గాని అట్లు నిర్ణయించిన బలప్రకారము అనుభవములో పెట్టుకొనగా ఫలితములు సరిగా నుండుట లేదు. కాని పారాశర్యమతమున చెప్పబడిన మూడవ పద్ధతి ప్రకారము యోగావయోగములను నిర్ణయించిన తరువాత కాళిదాసు మతము ప్రకారము బలసాధన చేసికొని, గ్రహములు యోగగ్రహములైనచో సప్త వర్గ బలము ప్రకారము వచ్చిన బలము హెచ్చుగానున్న ఎక్కువ యోగము చేయుదురనియు, బలము తగ్గినచో యోగము తగ్గుననియు, అవయోగకారకులైనచో అవయోగము చేయుటకు బలవంతులనియును, ఈ బలము తగ్గిన యెడల అవయోగము తగుననియు గ్రహించవలెను. కాబట్టి కాళిదాసు సప్త వర్గ బలము కూడ కొంత వరకు యోగమునుగాని, అవయోగమును గాని గ్రహములకు హెచ్చించుటకు తగ్గించుటకు కూడ ఉపయోగపడును.
