-
-
షాడో ఇన్ ది జంగిల్
Shadow in the Jungle
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 113Language: Telugu
గలగలమంటూ ప్రవహిస్తున్నది మిజోనది. నీటి అంచున తల తుడుచుకుంటున్నదొక యువతి. అప్పుడే నీటిలోనుంచి బయటకు రావడం వల్ల నీటి బిందువులు ముత్యాల్లాగా మెరుస్తున్నాయి వంటిమీద. స్విమ్మింగ్ సూట్ బిర్రుగా వంటికి అతుక్కుపోయింది. తుమ్మెద రెక్కల్లా వున్న పొడుగాటి జుట్టును ముందుకుజార్చి టర్కీ టవల్‌తో తుడుచుకుంటున్నది.
'టప్' మని శబ్దం వినిపించి అనుమానంగా నదిని పరీక్షించింది ఆమె. ఆ కాటుక కనులు ఎగసిపడుతున్న అలలను జాగ్రత్తగా చూశాయి. ఇంతలో నీటిని చీల్చుకుని ఆమె కాలి దగ్గర ప్రత్యక్షమయిందొక చెయ్యి. పాదాన్ని గట్టిగా పట్టుకుని గట్టిగా గుంజింది. కెవ్వున కేకపెట్టి నదిలో పడిపోయిందామె. రెండుక్షణాల అనంతరం రెండు తలలు నీటిమీద తేలాయి. రెండవ ఆకారం మెడ చుట్టూ చేతులు చుట్టి కిల కిలా నవ్వింది ఆ యువతి. ఆమెనలాగే చేతుల మీద పట్టుకొని తీసుకువచ్చాడతను.
అతని భుజాన్ని బిగించి పట్టుకుని తలపైకి ఎత్తిందామె పెదిమలు- పెదిమలు కలిశాయి. గాఢచుంబనంలో మైమరిచి పోయారు - వాళ్ళిద్దరూ.
ఆమె ఉన్నట్లుండి అతని చేతులలోంచి కిందికి జారింది. ఒక్కక్షణం అటూ యిటూ చూసింది. ముప్పై అడుగుల దూరంలో వున్న పొదమీద పడ్డాయామె చూపులు. పొద మీది కొమ్మలు కొంచెంగా వూగుతున్నాయి. ఆ కొమ్మలను వూపేటంత గాలి వీచడంలేదు.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.