-
-
షాడో! షాడో!! షాడో!!!
Shadow Shadow Shadow
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Pages: 211Language: Telugu
లోగడ ప్రచురించబడిన షాడో అడ్వెంచర్ "రన్ ఫర్ ది బోర్డర్" తరువాతి కథ ఇది.
నీలగిరిలో సి.ఐ.డి చీఫ్ ఫెర్నాండెజ్‌కి స్లిప్ ఇచ్చి బోర్డర్స్ వైపు బయలుదేరుతాడు షాడో. పాకిస్తాన్లో కొంత కాలం తలదాచుకోవాలని అతని ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.
కానీ, ముందు జాగ్రత్తలు చాలా తీసుకున్నాడు ఫెర్నాండెజ్. షాడోని అనుసరించడానికి అనువుగా వున్నాయనుకున్న రాజమార్గాలన్నీ పోలీసు బలగాలతో నిండిపోయాయి. సి. ఐ.డిలకు తెలియకుండా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలో చీమ కూడా అడుగుపెట్టలేనంత విజిలెన్స్ ప్రారంభమైంది. కాలినడకన పోవాల్సిన కుగ్రామాల్లో సైతం షాడో ఆగమనాన్ని ఇన్వైట్ చేస్తూ పొంచి వున్నారు ఫెర్నాండెజ్ అనుచరులు.
ఎటుచూసిన షాడో గురించి ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలే వినిపిస్తున్నాయి. ఎటు తల తిప్పినా షాడో పోలీసుల కళ్ళుకప్పి తప్పించుకున్న గాథలే వినవస్తున్నాయి.
ఫెర్నాండెజ్ షాడోని పట్టుకోలేడని గతంలో అభిప్రాయపడిన పౌరులు కూడా యిక షాడో పని అయిపోవచ్చిందనే భావించడం మొదలుపెట్టారు!!! ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది "షాడో! షాడో!! షాడో!!!" అనే యీ షాడో ఎడ్వంచర్. ఇక చదవండి.
This book is now available in Tenglish script with Kinige. For details, click the link.